Anant Ambani - Messi: మెస్సీకి ఖరీదైన వాచ్.. అంబానీనా మజాకా!
Anant Ambani - Messi (Image Source: Twitter)
జాతీయం

Anant Ambani – Messi: మెస్సీకి ఖరీదైన వాచ్ గిఫ్ట్.. అనంత్ అంబానీనా మజాకా.. ధర ఎన్ని కోట్లంటే?

Anant Ambani – Messi: ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ముంబయి పర్యటన సందర్భంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని మెస్సీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లే వాచ్ ను అనంత్ అంబాగనీ బహుమానంగా ఇచ్చారు. RM 003-V2 GMT టూర్‌బిల్లన్ ‘ఆసియా ఎడిషన్’ లగ్జరీ వాచ్‌ను ఇచ్చి మెస్సీని సర్ ప్రైజ్ చేశారు. ఈ వాచ్ ధర సుమారు 1.1 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.10 కోట్లు. ఇది లిమిటెడ్ ఎడిషన్ వాచ్ కాగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 మాత్రమే ఇలాంటి వాచ్ లు తయారు చేయబడ్డాయి.

అయితే లియోనెల్ మెస్సీకి వాచ్ బహుకరిస్తున్న సమయంలో అనంత్ అంబానీ సైతం ఖరీదైన వాచ్ ను చేతికి ధరించి కనిపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన రిచర్డ్ మిల్ వాచ్‌లలో ఒకటైన ‘Piece Unique RM 056 సఫైర్ టూర్‌బిల్లన్ ధరించారు. దీని విలువ 5 మిలియన్ డాలర్లు. అంటే సుమారు 45.59 కోట్ల రూపాయలు. ఈ ప్రత్యేకమైన రిచర్డ్ మిల్లె టైమ్‌పీస్ ప్రస్తుతం బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా, ఫార్ములా 1 డ్రైవర్ మిక్ షూమేకర్, మాజీ ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు, ఫెరారీ జట్టు ప్రిన్సిపాల్ జీన్ టాడ్డ్ వంటి ప్రముఖులు ధరిస్తున్నారు. అలాగే జోహోర్ క్రౌన్ ప్రిన్స్ తుంకు ఇస్మాయిల్ ఇబ్ని సుల్తాన్ ఇబ్రహీం, వాచ్‌మేకర్ కరి వౌటిలైనెన్ కూడా ధరిస్తున్నారు. ఇప్పుడు అంత ఖరీదైన వాచ్‌ను మెస్సీ ధరించాడు.

Also Read: Bhumana Karunakar Reddy: శ్రీవారికి చంద్రబాబు ద్రోహం.. రూ.3 వేల కోట్లు దోచిపెట్టారు.. టీటీడీ మాజీ చైర్మన్

ఇదిలా ఉంటే వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో మెస్సీ పర్యటన అద్భుతంగా సాగింది. అక్కడ అనుసరించే సంప్రదాయాలకు అనుగుణంగా సంప్రదాయ హిందూ వేషధారణలో మెస్సీ వంతారాలో పర్యటించారు. అక్కడి సింహాలు, తెల్ల పులులు, చిరుతలు, ఏనుగులు చూసి మెస్సీ ఎంతగానో మైమరిచిపోయారు. వాటితో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా వంతారాలో తనకు ఎంతగానో ఇష్టమైన సింహం పిల్లకు అనంత్ రాధిక అంబానీ మెస్సీ పేరును పెట్టి అతడ్ని గౌరవించారు. ఇక భారత పర్యటనను ముగించుకొని వెళ్తూ దేశ ప్రజలకు మెస్సీ ధన్యవాదాలు తెలియజేశారు. దిల్లీ, ముంబయి, కోల్ కత్తా నగరాల్లో తనకు లభించిన ఆతిథ్యం చాలా గొప్పగా ఉందని పేర్కొన్నారు. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో మెస్సీ పోస్ట్ పెట్టారు.

Also Read: Telangana Congress: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం.. అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు!

Just In

01

Tamil Nadu Crime: తూత్తుకుడిలో దారుణం.. భర్త ముందే భార్యపై అత్యాచారం..!

YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేస్తున్న​ రిపోర్టర్‌ అరెస్ట్..!

Transgender Nandini: పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబర్‌గా ట్రాన్స్ జెండర్ గెలుపు..?

Collector BM Santhosh: ఎర్రవల్లి మండల కేంద్రంలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్ సంతోష్

Bigg Boss Telugu 9: తప్పిస్తే గెలుస్తారు.. బిగ్ బాస్ దెబ్బకి షాకైన హౌస్‌మేట్స్!