CS Ramakrishna Rao: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు సూచించారు. ఆయన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బదలాయింపు సజావుగా వేగవంతంగా పూర్తి కావాలని సూచించారు. ఈ ప్రక్రియను ఇదివరకు చేసుకున్న ఒప్పందాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేపట్టాలన్నారు. రాబోయే వంద రోజుల్లో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు.
Also Read: CS Ramakrishna Rao: శంషాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన సీఎస్
ప్రతిపాదనలను రూపొందించాలి
టేకోవర్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఐడీబీఐ ఈ మేరకు తన నివేదికను త్వరితగతిన పూర్తి చేసి బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇందులో ఎల్ అండ్ టీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆ తర్వాత ఆపరేషనల్, మెయింటెనెన్స్‌కు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ సర్పరాజ్ అహ్మద్‌ను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు డా. ఎన్వీఎస్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ కేవీబీ రెడ్డి, ఐడీబీఐ అధికారులు, హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు పాల్గొన్నారు.
Also Read: CS Ramakrishna Rao: శంషాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన సీఎస్

