Realme Narzo 90: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ భారత్‌లో తన పనితీరు ఆధారిత నార్జో సిరీస్‌ను మరింత విస్తరించింది. కొత్తగా రియల్‌మీ నార్జో 90, రియల్‌మీ నార్జో 90x అనే రెండు స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ముఖ్యంగా యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ సిరీస్‌లో బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్, డిస్‌ప్లే పనితీరు, డ్యూరబిలిటీపై ఎక్కువ దృష్టి పెట్టింది.
ఈ రెండు ఫోన్లలోనూ 7000mAh భారీ బ్యాటరీ, 60W ఫాస్ట్ చార్జింగ్, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్, అలాగే IP65 రేటింగ్‌తో పాటు IP69 ప్రమాణాల సపోర్ట్ ఉండటం విశేషం.
రియల్‌మీ నార్జో 90: ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
నార్జో 90 సిరీస్‌లో హయ్యర్ ఎండ్ మోడల్‌గా రియల్‌మీ నార్జో 90ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో Dimensity D6400 (2.5E) ప్రాసెసర్ ఉంది. గేమింగ్, పనితీరు నిలకడగా ఉండేందుకు 6050mm² వెపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అందించారు. ఆడియో అనుభవాన్ని మెరుగుపరిచేందుకు డ్యుయల్ స్పీకర్లు, మెరుగైన హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ERM మోటర్‌ను ఇచ్చారు. డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.57 ఇంచుల FHD 2.5D OLED స్క్రీన్ ఉండగా, గరిష్ఠంగా 4000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విభాగంలో Sony 85D2 రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ 181 గ్రాముల బరువుతో స్లిమ్ డిజైన్‌లో వస్తుంది. IP65, IP69 స్థాయి డ్యూరబిలిటీ కూడా ఇందులో ఉంది.
రియల్‌మీ నార్జో 90x ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
నార్జో 90x మోడల్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, రోజువారీ స్మూత్ పనితీరు కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించారు. ఇందులో Dimensity D6300 (24E) ప్రాసెసర్ ఉంది. మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా వినియోగం, సాధారణ గేమింగ్‌కు ఇది అనుకూలంగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల HD LCD డిస్‌ప్లే ఉండగా, 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. కెమెరా సెటప్‌గా Sony 85D2 + ఫ్లికర్ రియర్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. నార్జో 90x ఫోన్ బరువు 212 గ్రాములు ఉండగా.. ఇది కూడా IP65, IP69 రేటింగ్‌లను సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ ధరలు ఎలా ఉన్నాయంటే?
భారత్‌లో రియల్‌మీ నార్జో 90 ధరలు
6GB + 128GB వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది.
8GB + 128GB వేరియంట్ ధర రూ. 17,499 గా ఉంది.
ఈ ఫోన్ డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 26 వరకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
రియల్‌మీ నార్జో 90x ధర
6GB + 128GB వేరియంట్ ధర రూ. 11,999 గా ఉంది.
దీని మొదటి సేల్ డిసెంబర్ 23న 12 గంటల పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.

