King Pin In Liquor Case..!Six Days Custody
జాతీయం

Delhi Liquor Case : లిక్కర్ కేసులో కింగ్ పిన్..!ఆరు రోజుల కస్టడీ

  • కేజ్రీవాల్ అరెస్ట్‌తో హీటెక్కిన ఢిల్లీ
  •  లిక్కర్ స్కాం కేసులో ఆయనే సూత్రధారి
  •  పది రోజుల కస్టడీ అడిగిన ఈడీ
  •  ఆరు రోజులకి ఓకే చెప్పిన కోర్టు
  •  స్కాంతో తనకేం సంబంధం లేదన్న సీఎం
  •  లావాదేవీలూ తెలియదని స్పష్టం

King Pin In Liquor Case..!Six Days Custody : తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా సుదీర్ఘ వాదనలు సాగాయి. తమకు పది రోజుల కస్టడీ కావాలని ఈడీ అడిగింది. కానీ, ఆరు రోజులకు ఓకే చెప్పింది న్యాయస్థానం. కేజ్రీవాల్ తరఫున లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎందుకని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఆధారాలు ఉంటే కస్టడీకి ఎందుకని ప్రశ్నించారు.

అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం లేదన్న సింఘ్వీ, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే, గోవా ఎన్నికల్లో వాడిన డబ్బుకు లిక్కర్ కేసుతో సంబంధం ఉందని ఈడీ న్యాయవాది బల్లగుద్ది మరీ చెప్పారు. గోవాకు 4 మార్గాల్లో నగదు తరలించారని చెప్పారు. కానీ, కేబినెట్ ఆమోదంతోనే లిక్కర్‌ పాలసీ జరిగిందని స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేజ్రీవాల్‌ కోర్టుకు తెలిపారు. ఆ లావాదేవీలతో సంబంధం లేదని న్యాయమూర్తికి చెప్పారు.

Read More: లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితకి ఎదురుదెబ్బ!

మరోవైపు కస్టడీ పిటిషన్ కీలక విషయాలను పొందుపరిచింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, ప్రధాన కుట్ర దారుడు అంటూ వ్యాఖ్యానించింది. మద్య విధానంలో సౌత్ గ్రూప్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించి ముడుపులు పొందారని పేర్కొంది. కవితతో సహా సౌత్ గ్రూప్‌తో వ్యవహారాలు నడిపి ముడుపులు పొందారని తెలిపింది. మంత్రివర్గ ఉప సంఘం, మంత్రి వర్గం మధ్య విధానాలు రూపొందించడానికి రెండు రోజులు ముందే నిందితుల చేతికి డబ్బు చేరిందని చెప్పింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో అనేక ముఖ్య విషయాలు వెల్లడించారని, ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి కవిత తనతో టచ్‌లో ఉన్నట్లు 100 కోట్లు ఇస్తామని చెప్పినట్లు కేజ్రీవాల్ తనతో చెప్పారని వెల్లడించినట్టు పేర్కొంది.

కవితతో కలిసి ముందుకు నడిచేలా ప్లాన్ చేసుకోమని కేజ్రీవాల్ చెప్పారని శ్రీనివాసులు రెడ్డి చెప్పినట్టుగా ఈడీ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. కేజ్రీవాల్ క్యాంపు కార్యాలయం నుంచే విజయ్ నాయర్ వ్యవహారాలు నడిపించారని వివరించింది. సౌత్ గ్రూపు నుంచి 100 కోట్ల ముడుపులను కేజ్రీవాల్ తరఫున విజయ్ నాయర్ అందుకున్నారని తెలిపింది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ తరఫున అభిషేక్ బోయినపల్లి లావాదేవీలు నడిపారని చెప్పింది ఈడీ.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!