Priyanka Gandhi: పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!
Priyanka Gandhi (imagecredit:twitter)
Political News, Telangana News

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Priyanka Gandhi: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(MP Priyanka Gandhi) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పథకం పేరు మార్చడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల డబ్బు ఖర్చు తప్ప ఇంకేం ప్రయోజనం లేదని అన్నారు. వంద రోజుల ఉపాధి కల్పించి పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమానికి ఇప్పుడు పేరు మార్చాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.

Also Read: Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

పథకంలో కేంద్రం మార్పులు

పేరు మార్చితే దానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు, వస్తువులపై ఇప్పటికే ముద్రించిన పేరు మార్చాల్సి వస్తుందని వివరించారు. ఇదంతా ఖరీదైన ప్రక్రియ అని చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme)లో కేంద్రం మార్పులు చేసింది. ఈ పథకం పేరును ‘పూజ్య బాపూ గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మారుస్తూ శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పేరు మార్పుతోపాటు కూలీలకు పనిదినాలు, వేతనాలు పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో ఒక కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు మాత్రమే కల్పిస్తున్నారు. తాజా సవరణతో దీన్ని 125 రోజులకు పెంచారు. కేంద్ర నిర్ణయంతో పేదలకు అదనంగా మరో 25 రోజుల పని దొరకనున్నది.

Also Read: Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..