Shambala Movie: ‘శంబాల’ నుంచి 'నా పేరు శంబాల' సాంగ్ రిలీజ్..
sambala-song(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..

Shambala Movie: వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ మాత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి నా పేరు శంబాల పాట విడుదలైంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు నటించిన ఈ మూవీ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. ఫాన్సీ రేటుకే ఈ సినిమాని మేకర్స్ అమ్మేశారు. ఓ సినిమా విడుదలకు ముందే అన్ని డీల్స్ క్లోజ్ అవ్వడం, బిజినెస్ జరిగిపోవడం మామూలు విషయం కాదు. ఎన్నో క్రేజీ చిత్రాలకు ఇంకా ఓటీటీ డీల్ పూర్తి కాలేదు.

Read also-Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

శంబాల అంటూ టైటిల్ ప్రకటించిన క్షణం నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్, విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్‌ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. డిఫరెంట్ ప్రమోషన్స్ తో శంబాల టీం జనాల్లోకి దూసుకుపోతోంది. డిసెంబర్ 25 న శoబాల బ్లాక్ బస్టర్ కానుందని అంతా ఫిక్స్ అయ్యారు. ‘శంబాల’ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలో ఆహా పోటీ పడి గెలిచింది. ఇక శాటిలైట్ విషయంలో జీ నెట్‌వర్క్ ముందుండి హక్కులను కైవసం చేసుకుంది. ఇక ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Read also-Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

‘నా పేరు శంబాల’ అంటూ సాగే ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్, శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన బాణీ అందరినీ హత్తుకునేలా ఉంది. ఇక స్పెషల్ గా షూట్ చేసిన లిరికల్ వీడియో, అందులో గీతా మాధురి కనిపించిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది. నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడా వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో రాజీపడని నాణ్యతతో రూపొందిస్తున్నారు. ఈ మూవీని విజువల్ వండర్‌‌గా, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచారు. ప్రవీణ్ కె బంగారి అందించిన ఆకర్షణీయమైన విజువల్స్, శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా మారనున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో రాణించగల ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి