Uttam Kumar Reddy: ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి ఉత్తమ్ లేఖ
Uttam-Kumar-Reddy (Image source Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో (Telangana) గోదావరి, కృష్ణా బేసిన్లలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) శనివారం నాడు ఒక సుధీర్ఘ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలలోని ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన అనేక కీలకమైన సమస్యలు ధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, పదేపదే విన్నవించినా, ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినా ఇప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. నీటి హక్కులను పరిరక్షణ, రాష్ట్ర సాగునీటి అవసరాలను తీర్చడానికి, తద్వారా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆర్థిక సాయం పొందేందుకు వీలుగా పరిష్కారం చూపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ తరపున రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ కాంతారావు, శ్రమ శక్తి భవన్‌లో సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్‌లను కలిసి లేఖ అందజేశారు.

90 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి (PRLIS) సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ఇవ్వాల్సిన క్లియరెన్స్‌ పెండింగ్‌లో ఉందని, సీడ్ల్యూసీ సందేహాలకు సమాధానాలు సమర్పించినప్పటికీ, క్లియరెన్స్ ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. తద్వారా కరువు ప్రాంత రైతులకు ప్రయోజనాలు అందడంలో జాప్యం జరుగుతోందని, ప్రాజెక్టు వ్యయం పెరుగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సీడ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్ల నుంచి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వేగంగా క్లియర్ ఇవ్వాలని కోరారు.

Read Also- Harish Rao: ఫుట్‌బాల్ మీద ఉన్న శ్రద్ధ.. స్కూల్ విద్యార్థులపైన లేదా.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

ఇక, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడ్ల్యూసీకి సమర్పించామని, కానీ, ప్లానింగ్ డైరెక్టరేట్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని తెలిపారు. సీడ్ల్యూసీ అభ్యంతరాలపై సమాధానాలు అందించామని, దీనికి సంబంధించిన క్లియరెన్స్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ఇక, కృష్ణా జలాల వివాదానికి సంబంధించి, కృష్ణా నదిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగులు జలాల ఆధారంగా చేపట్టిన తెలంగాణ ప్రాజెక్టులకు సీడ్ల్యూసీ నుంచి ఇంకా క్లియరెన్స్‌లు రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్-2 (KWDT-II) ముందు విచారణలో ఉంది.

Read Also- Telangana DGP: ఉప్పల్‌లో సీఎం – మెస్సీ మ్యాచ్.. కీలక సూచనలు చేసిన డీజీపీ శివధర్ రెడ్డి

మరోవైపు, పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు (PBLP) అంశాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ మిగులు జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను (PFR) సీడ్ల్యూసీకి సమర్పించిందని, అయితే, అంతర్రాష్ట్ర నదీ ప్రాజెక్టులకు 75 శాతం డిపెండబిలిటీ ప్రాతిపదికగా జల లభ్యత ఉండాలని, కానీ, 1980 జీడ్ల్యూడీటీ అవార్డులో మిగులు జలాలు అనే ప్రస్తావన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక, అల్మట్టి డ్యామ్ వద్ద కర్ణాటక భూసేకరణ చేపడుతోందని ఉత్తమర్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యామ్ నిల్వ స్థాయిని +524.256 మీటర్ల వరకు పెంచడానికి భూసేకరణ చేపట్టేందుకు అక్టోబర్ నెలోల జీవో జారీ చేసిందని ప్రస్తావించారు. అయితే, ఈ ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నాయని, సుప్రీం స్టే ఉన్నందున, కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను కొనసాగించకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Just In

01

Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!