Jagga Reddy: మెదక్ ఉమ్మడి జిల్లా రాజకీయాలలో జగ్గారెడ్డిది ప్రత్యేక స్టైల్.. నా నియోజక వర్గంలో.. కాంగ్రెస్ పార్టీలో నేను చెప్పిందే వేదం.. అదే కరెక్టు అన్నా పంథాలోనే సంగారెడ్డి(sangareddy) నియోజక వర్గంలో ఒంటి చేత్తో కాంగ్రె పార్టీ రాజకీయాలు నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే గా పోటీ చేయనని… ఆ స్తానంలో తన సతీమణి నిర్మల పోటీ చేస్తుందని ప్రకటించి, అందరిని ఆశ్చర్యపరచారు. మెదక్ రాజకీయాలలో జగ్గారెడ్డ నిర్ణయం సంచలనంగా మారింది. శనివారం సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన సర్పంచ్ లను టి జి ఐ ఐ సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సన్మానించారు. టి పి సి సీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నాయకులను సన్మానించి రాజకీయంగా అన్ని రకాలుగా అండగా ఉంటానని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాకుండా కొండాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయినా మాస్క్ అలవేని నరసింహారెడ్డి నీ సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Teachers Protest: పంచాయతీ రాజ్‌పై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. అతి తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడంపై ఫైర్!
కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్ లకు నో ఎంట్రీ…!
సంగారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన సర్పంచ్ లను నిర్మలా జగ్గారెడ్డి సన్మానించారు..ఓడిపోయిన వారిని జగ్గారెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీ కి వ్యతిరేకంగా రెబల్ గా సర్పంచ్ లు పోటీ చేసి గెలిచిన సర్పంచ్ లకు తన వద్దకు ఎంట్రీ లేదని ప్రకటించి..రాజకీయాలలో .తనదైన ముద్ర వేసుకున్న జగ్గారెడ్డి…గెలిచిన సర్పంచ్ లు,పార్టీ తరపున పోటీ చేసి ఓడిన నాయకులు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: Phone Tapping Case: లొంగిపోయిన ప్రభాకర్ రావు.. వారం రోజులపాటు కస్టడీ విచారణ!

