Crime News: దారుణం.. ఐదేళ్ల బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రి
Crime News (imagecredit:twitter)
క్రైమ్, హైదరాబాద్

Crime News: దారుణం.. ఐదేళ్ల బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రి

Crime News: తనకు నచ్చనివారి పిల్లలతో ఆడుతున్నాడని పదేళ్ల బాలున్ని దారుణంగా హత్య చేశాడు సవతి తండ్రి. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్ట గాజేమిల్లత్ ప్రాంతానికి చెందిన నఫీస్​ బేగంకు పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తరువాత ఆమెకు కూతురు, కుమారుడు షేక్ మహ్మద్​ అజహర్​ (10) పుట్టారు. కొడుకు పుట్టిన తరువాత విభేధాలు తలెత్తటంతో మొదటి భర్త నుంచి ఆరేళ్ల క్రితం విడిపోయిన నఫీస్​ బేగం తాను ప్రేమించిన షేక్​ ఇమ్రాన్​ అనే వ్కక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతనితోనే ఉంటోంది. కాగా, ఇంటి గ్రౌండ్​ ఫ్లోర్​ లో ఉంటున్న వారితో షేక్​ ఇమ్రాన్ కు పడక పోయేది.

కోపంతో రెచ్చిపోయిన షేక్​ ఇమ్రాన్

ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలోని పిల్లలతో మాట్లాడొద్దని.. ఆడుకోవద్దని అజహర్​ తో చెప్పాడు. అయితే, అజహర్​ వారితో ఆడుకునేవాడు. ఈనెల 7న ఇలాగే ఆడుకుంటుండగా పిల్లల మధ్య గొడవ జరిగింది. దాంతో అజహర్​ అవతలి వారిని తిట్టాడు. దాంతో ఆ కుటుంబ పెద్దలు షేక్ ఇమ్రాన్​ ను పిల్లలను పెంచే పద్దతి ఇదేనా? అని తిట్టారు. దాంతో కోపంతో రెచ్చిపోయిన షేక్​ ఇమ్రాన్ బాలున్ని విచక్షణారహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా పైకి లేపి రోడ్డపైకి విసిరికొట్టాడు. దాంతో అజహర్​ తలకు తీవ్ర గాయాలై చెవుల్లో నుంచి రక్తస్రావం జరిగింది. వెంటనే అజహర్​ ను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అజహర్​ శనివారం తుదిశ్వాస వదిలాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Event Organiser Arrest: కోల్‌కత్తాలో గందరగోళం.. మెస్సీకి సారీ చెప్పిన సీఎం.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్

Just In

01

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!