Lionel Messi Statue: పుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13-15 తేదీల మధ్య మూడ్రోజుల పాటు ఆయన భారత్ లోని నాలుగు ప్రధాన నగరాల్లో పర్యటించనున్నారు. తొలుత కోల్ కత్తా చేరుకోనున్న మెస్సీ.. ఆ తర్వాత హైదరాబాద్, ముంబయి, దిల్లీ నగరాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కోల్ కత్తాకు రానున్న మెస్సీ కోసం అక్కడివారు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. నగరంలోని లేక్ టౌన్ వద్ద ఆయన కోసం భారీ విగ్రహాన్ని సిద్దం చేశారు. శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ ఈ అర్జెంటీనా సూపర్ స్టార్ కోసం 70 అడుగుల ఐరన్ విగ్రహాన్ని రూపొందించింది.
40 రోజుల్లో.. 70 అడుగుల విగ్రహం
ఫిఫా వరల్డ్ కప్ ను పైకెత్తి చూపిస్తున్నట్లుగా మెస్సీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ తెలిపారు. ఈ విగ్రహాన్ని రూపొందించేందుకు 40 రోజుల సమయం పట్టినట్లు తెలిపారు. ‘ఇది చాలా పెద్ద విగ్రహం. 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రపంచంలో మెస్సీకి ఇంత పెద్ద విగ్రహం మరేదీ లేదు. మెస్సీ కోల్‌కతాకు రావడం చాలా సంతోషకరం. ఆయనకు చాలా మంది అభిమానులున్నారు’ అని బోస్ చెప్పుకొచ్చారు.
#WATCH | West Bengal: A 70-ft tall statue of football legend, Lionel Messi has been built by Sree Bhumi Sporting Club at Lake Town in South Dum Dum, Kolkata. The Argentine footballer is set to arrive in Kolkata on December 13, during his G.O.A.T India Tour, to inaugurate the… pic.twitter.com/qcydyYtHbU
— ANI (@ANI) December 10, 2025
మెస్సీ విగ్రహం ఎందుకు పెట్టారంటే?
గతంలోనూ పలువురు ఫుట్ బాల్ దిగ్గజాలు కోల్ కత్తా నగరాన్ని సందర్శించినట్లు సుజిత్ బోస్ తెలిపారు. మారడోనా (Maradona), మార్జినెజ్ (Martinez), రొనాల్డినో (Ronaldinho) శ్రీ భూమికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ‘మెస్సీ ఇనుప విగ్రహాన్ని మోంటి పాల్ నిర్మిందారు. మా వద్ద మారడోనా విగ్రహం కూడా ఉంది. అయితే మెస్సీది ఎందుకు ఉండకూడదని ప్రజలు అనుకున్నారు. అందుకే మెస్సీ విగ్రహాన్ని సిద్దం చేశాం. ఈ విగ్రహం మెస్సీకి నచ్చుతుంది. వర్చువల్ గా ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది’ అని బోస్ తెలిపారు. విగ్రహం తయారీకి మమతా బెనర్జీ ప్రభుత్వం తన వంతు తోడ్పాటు అందించిందని ఆయన పేర్కొన్నారు.
Leo Messi’s 70 feet tall statue in Kolkata, India! This is incredible! Wow 🇮🇳😱 pic.twitter.com/ukQOCfoxKW
— LEO MESSI FAN ZONE 🇦🇷🐐 (@LeoMessiFanZone) December 12, 2025
Also Read: Rachakonda CP: రేపే సీఎం – మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్.. రాచకొండ సీపీ కీలక సూచనలు
కోల్ కత్తాలో మెస్సీ షెడ్యూల్..
లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13 తెల్లవారుజామున 1.30 గం.లకు కోల్ కత్తా విమానాశ్రయానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా హోటల్ రూమ్ కు వెళ్తారు. ఉదయం 9.30-10.30 మధ్య అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. 10.30 – 11.45 మధ్య తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్ గా మెస్సీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సాల్ట్ లేక్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. అనంతరం బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరభ్ గంగూలీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

