Local Body Elections: నల్గొండ జిల్లా పంచాయతీ పోరులో మొదటి దశ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 318 పంచాయతీల్లో 2641 సర్పంచ్ అభ్యర్థులు, 2870 వార్డు స్థానాలకు 8575 మంది బరిలో నిలిచారు. ఇందులో 22 గ్రామ పంచాయతీలు, 375 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు ఎన్నికలకు రావడంతో ఓటింగ్ నమోదు శాతం పెరిగింది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు హోరా హోరీగా సాగింది. ఓటు వేయడంతో పాటు తమ వాళ్లను పలకరించే, చూసే అవకాశం ఉండటంతో స్థానిక ఎన్నికలకు వచ్చిన ఓటర్లు ఉత్సాహంగా కనిపించారు.
ఉద్రిక్తతల మధ్యే..
ఉరుమడ్లలో ఉద్రిక్తత అదేవిధంగా ఉరుమడ్ల గ్రామ పంచాయతీలో ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు వెళ్లిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మదర్ డెయిరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో పాటు అనుచరుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్లలో మొత్తం 4,61,169 మంది ఓటర్లు ఉన్నారు. కాగా సుమారు 94 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ ముగియగా బ్యాలెట్ బాక్సులను డీఆర్‌సీ సెంటర్లకు చేర్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Also Read: Akhanda Controversy: ‘అఖండ’ ప్రీమియర్ షో వివాదంపై హైకోర్టులో మరో పిటిషన్.. విచారణ ఎప్పుడంటే?

