CM Chandrababu: విశాఖలో కాగ్నిజెంట్.. సీఎం కీలక వ్యాఖ్యలు
CM Chandrababu (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: విశాఖలో మరో మైలురాయి.. కాగ్నిజెంట్ ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: ఐటీ రంగంలో విశాఖపట్నం మరో మైలురాయిని అందుకుంది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ శంకస్థాపన చేశారు. కాగ్నిజెంట్ తో మరో ఏడు ఐటీ సంస్థలకు వారు భూమి పూజ చేశారు. అంతకుముందు మంత్రి నారా లోకేశ్.. కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని సైతం విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ అని కొనియాడారు.

‘కాగ్నిజెంట్‌లో లక్ష ఉద్యోగాలు’

కాగ్నిజెంట్ ఇచ్చిన ఒక్కపిలుపుతో 4500 మంది ఉద్యోగులు విశాఖలో పనిచేయడానికి రావడం హర్షించతగ్గ విషయమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘విశాఖలో 25వేలు నుంచి లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని కాగ్నిజెంట్ ప్రతినిధులతో చెప్పడం జరిగింది. నాకు చిన్నవి కనిపించవు. ఏది చేసిన భారీగా లక్ష్యాలు ఉంటాయి.హైదరాబాద్ అలా అభివృద్ధి చేసిందే. విశాఖలో ఉన్న వనరులు, సౌకర్యాలు ఏ పెద్ద నగరాలకు లేవు. మూడు దశాబ్దాల ముందు తాను చెప్పినట్టుగా ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. అప్పటివరకు ఇండియా అంటే ఇతర దేశాలకు చిన్న చూపు ఉండేది. 1995లో ఇంటర్నెట్ రివల్యూషన్ వస్తే ఐటీ పునాదులు మనం తీసుకున్నాం. అదే పునాదులపై ఇప్పుడు అనేక సెక్టార్లు వచ్చాయి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

విశాఖలో 150 టెక్ కంపెనీలు

వచ్చే ఏడాది కాలంలో 25వేల మంది పనిచేసే సెంటర్ గా కాగ్నిజెంట్ ఎదుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘విశాఖలో మరో 8 ఎనిమిది సెంటర్లకు శంకుస్థాపనలు చేశాం. విశాఖ అందమైన, ప్రశాంతమైన నగరం. ఇదో అద్భుత ప్రపంచంగా మారుతుంది. త్వరలో భోగాపురం విమానాశ్రయం, మెట్రో రైలు వంటివి వస్తున్నాయి. ఇప్పటి వరకు తూర్పు నావికాదళం నగరంగా ఉన్న విశాఖ నగరం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఐటీ రంగంలో కూడా ఒక స్థాయికి గుర్తింపు వస్తోంది. విశాఖ నగరంలో 150 టెక్ కంపెనీలు ఉన్నాయి’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

విశాఖలో లివింగ్ కాస్ట్ తక్కువ

ఏపీలో టాలెంట్ కి కొదవ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘తెలుగు ప్రజలు, యువత దేశంలో ఎన్నో ప్రదేశాల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ లీడర్షిప్ కూడా ఉంది. విశాఖలో లివింగ్ కాస్ట్ 25 శాతం తక్కువ. ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి సరైన ప్లానింగ్ లేకపోవడమే. ఈ రోజు విశాఖ ఎకనామిక్ రీజన్ సమీక్ష చేస్తున్నాం. విశాఖ ఉమెన్ సేఫ్ సిటీ గా గుర్తింపు పొందింది. 2032కి ఈ ప్రాంతంలో 135 బిలియన్ యుఎస్ డాలర్ ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నాం. విశాఖను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: Allu Review: రణవీర్ సింగ్ ‘దురంధర్’ సినిమాకపై అల్లు అర్జున్ రివ్యూ ఇదే.. మాటల్లో చెప్పలేను..

హైదరాబాద్ తరహాలో విశాఖ అభివృద్ధి

మరోవైపు మంత్రి నారా లోకేశ్ సైతం కాగ్నిజెంట్ ఏర్పాటు గురించి మాట్లాడారు. ‘విశాఖలో కాగ్నిజెంట్ తో పాటు మరికొన్ని ఐటీ కంపెనీలు మొదలు పెట్టుకోవడం ఆనందంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు వేయి మందితో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం కావడం ఆహ్వానించదగ్గ విషయం. 99 పైసలుకి భూములు ఇస్తే కంపెనీలు వస్తాయన్న నమ్మకాన్ని ఈ రోజు నిలబెట్టుకున్నాం. ఏపీకి రావడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఐటీ, జీసీసీలతో విశాఖ ఆర్ధిక రాజధానిగా మారబోతోంది. హైదరాబాద్ తరహాలోనే విశాఖ అభివృద్ధి చెందుతుంది. మమ్మల్ని నమ్మి వచ్చిన కాగ్నిజెంట్ కు ధన్యవాదాలు’ అని లోకేశ్ అన్నారు.

Also Read: Kavitha: రూ.2500, గ్యాస్ ఫ్రీ హామీలు ఎక్కడ? వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏదీ? : కవిత

Just In

01

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా

Harish Rao: ఫుట్‌బాల్ మీద ఉన్న శ్రద్ధ.. స్కూల్ విద్యార్థులపైన లేదా.. సీఎంపై హరీశ్ రావు ఫైర్