Kavitha: బలంగా నిలదీసి అడిగితేనే మన పనులవుతాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. పాతబస్తీలోని యాకుత్‌పురా సమీపంలోని హనుమాన్ నగర్ ముంపు ప్రాంత ప్రజలతో ఆమె ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, జాగృతి తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగుతున్నామని, దీంతో అధికారులు కూడా స్పందించి పనిచేస్తున్నారన్నారు. ఓల్డ్ సిటీలో ఏ రోడ్డు చూసినా పన్నేండేళ్ల క్రితం వేసినవే ఉన్నాయని, మోరీలు, డ్రైనేజీ సిస్టమ్ 35 ఏళ్ల కిందివేనని వివరించారు. సిటిలో అందరికీ సమానమైన అభివృద్ధి కావాలని, ఇక్కడ చాలా దగ్గర పనుల కోసం డబ్బులు మంజూరయ్యాయని స్థానికులు చెబుతున్నారన్నారు. కాని పనులు మాత్రం పూర్తి కాలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మహిళలు గట్టిగా నిలదీస్తారన్నారు. యువ మిత్రులు మాత్రం కాస్త వెనుకబడ్డారని, వారు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కవిత సూచించారు.
Also Read: BRS MLA on Kavitha: కుక్కతో పోల్చుతూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ వ్యాఖ్యలు.. తీవ్ర ఆరోపణలు
హామీలు ఏమయ్యాయి?
జాగృతి తరఫున యాకుత్‌పురాలో కమిటీ వేస్తామన్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రూ.2500, గ్యాస్, కరెంట్ ఫ్రీ వంటి ఎన్నో స్కీమ్‌లు చెప్పారని, కానీ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. మూడేళ్లుగా చాలా మందికి పెన్షన్ రాని పరిస్థితి ఉందని, వికలాంగులకు కూడా పెన్షన్ ఇవ్వటం లేదని, ఇది చాలా ఘోరమైన పరిస్థితి అని కవిత వ్యాఖ్యానించారు. ఇక్కడున్న మహిళలు తమకు ఏదైనా ఉపాధి చూపించాలని అడుగుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలని, లేదంటే వారికి ఇస్తామన్న రూ.2500 ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
రూ.9 వేల కోట్ల బకాయిలు పెండింగ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.9 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని, దీంతో పిల్లలు చదువుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు. ఏ సమస్యను కూడా మేము విస్మరించకుండా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పిందని, ఇప్పటి వరకు దాని ఊసే లేదన్నారు. ఇక ఇండ్ల బాధలు చాలా మందికి ఉన్నాయన్నారు. కిరాయి కూడా కట్టలేని పరిస్థితి లో ప్రజలున్నారన్నారు. ఇక వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కార్లు కొట్టుకుపోయే పరిస్దితులు నెలకొన్నాయన్నారు. వీటన్నింటి మీద ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన అవసరముందని కవిత పిలుపునిచ్చారు.
Also Read: BRS MLA on Kavitha: కుక్కతో పోల్చుతూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ వ్యాఖ్యలు.. తీవ్ర ఆరోపణలు

