BRS MLA on Kavitha: ‘బీఆర్ఎస్ వర్సెస్ కవిత’ రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీ నేతలపై కవిత (MLC Kavitha) చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు క్రమంగా స్వరం పెంచుతున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) కౌంటర్ ఎటాక్‌ను మరింత తీవ్రం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను, హైదరాబాద్ ఎమ్మెల్యేలను అవినీతిపరులంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు (BRS MLA on Kavitha) చేశారు.
మాధవరం ఏమన్నారంటే?
‘‘కేటీఆర్‌పైన (Kavitha) మాట్లాడతావా?. ఏం మాట్లాడినవు నిన్న?. నీ భండారం మొత్తం ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా విప్పితే తట్టుకోలేవు నవ్వు. ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకో. ప్రజాసేవ చెయ్యి. ఇష్టమొచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకునేటోడు ఎవడూ ఉండడు. ఏ షాపుని, బట్టల షాపులను, బంగారం షాపులను కూడా వదల్లేదు నువ్వు. మేము కబ్జాదారులమా?. ఫిక్స్ అయ్యి ఉన్న ప్రోగ్రామ్‌కు వెళ్లాను. ఈమె వస్తుంటే, ఎవడో భయపడ్డడంట. నీ అసువంటి కుక్కలు మస్తు వచ్చిపోయినయ్ నా దగ్గరికి. కూకట్‌పల్లి ప్రజలు నాకు దేవుళ్లు. వాళ్ల కోసం నేను పాదాభివందనం చేస్తా. నా నీతి, నిజాయితీ చూసి ప్రజలు నన్ను గెలిపించారు. నీ మీద రేవంత్ రెడ్డి గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ సీరియస్ దృష్టిపెడితే నీ సంగతి, నీ మొగుడి సంగతి మొత్తం బయటకొస్తది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే భయపడేవాడు ఎవడూ లేడు. ప్రజల కోసం నేను ఉదయం 6 గంటలకే లేచి కూర్చుంటా. నాకో చరిత్ర ఉంది. ఈమె వస్తుందట. భయపడిపోయినమంట. ఎక్కడ తిరిగి ఏం చేసినవ్?. ఒకచోట ఒక ఎమ్మెల్యేను, మరోచోట ఇంకో ఎమ్మెల్యేని తిడతావు. ఇక ఖతం. దాని గురించి ఉండదిక’’ అని అన్నారు.
Read Also- Seethakka: గ్రామపంచాయతీ యువ నాయకత్వంతో గ్రామాభివృద్ధి జరగడం ఖాయం : మంత్రి ధనసరి సీతక్క
మంత్రి పదవులు అమ్ముకున్నావ్
‘‘మంత్రి పదవి ఎవరికి ఇచ్చావు?, ఎంతమందికి అమ్ముకున్నావ్?. తెలియదా మాకు?. మీ నాన్న అంటే గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏవిధంగా పేరుందో, కేసీఆర్‌కు అంతమంచి పేరుంది. ఆ పేరుని సర్వనాశనం చేశావ్. కేటీఆర్ హైదరాబాద్‌ను డెవలప్ చేస్తే ఆయనను తిడుతున్నావ్. నీ ప్లాన్ ఏందో నాకు తెలుసు. హరీష్ రావుని పార్టీ నుంచి వెళ్లగొట్టాలి. రేవంత్ రెడ్డి పట్టుకొని ఏవిధంగా వాళ్ల అన్నను (కేటీఆర్) జైలులో వేయించాలి. అప్పుడు పార్టీ నాయకత్వం అందుకొని, రాష్ట్ర మొత్తం తిరిగి దోచుకొని తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటూ పోతోంది. పార్టీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తోంది. నీలాంటోళ్లను 100 మందిని చూస్తుండేవాడిని. నీకు ప్రజలే బుద్ధి చెబుతారు. నువ్వు గెలిచింది ఒక్కసారి. నీ అత్తగారింటి దగ్గర రెండోసారి గెలవడం చేతకాలేదు నీకు. 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు నువ్వు ఓడిపోయావ్. ఉద్యమకారుల మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఎమ్మెల్సీ తీసుకోకుండా ఎవరికైనా ఇవ్వాల్సింది. నిన్ను ఉద్యమం చేయమని మేమెప్పుడైనా చెప్పామా?. ఉద్యమం చేశానని నేనెప్పుడైనా చెప్పానా?. ఆ రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. టీడీపీ సిద్ధాంతం కొరకు పనిచేశాం. అంతేగానీ నీకులాగా అబద్ధాలు చెప్పలేదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతిపరులంటావా?. హైదరాబాద్ లేకుంటే తెలంగాణే లేదు. రాష్ట్రం మొత్తం బాగుండాలని కోరుకునే వ్యక్తులం మేం హైదరాబాద్ వాళ్లం. ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదు. మేము వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవ్ తల్లి గుర్తుంచుకో నువ్వు’’ అని మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు’’ అని మాధవరం కృష్ణారావు రాజకీయ పరమైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కవిత ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
Kukatpally BRS MLA compares Kavitha to a dog and said “I've seen lot of dogs like you”
Says her plan is to sideline Harish, send KTR to jail, and so she can up take power and loot pic.twitter.com/fuVI20E8JU
— Naveena (@TheNaveena) December 9, 2025
Read Also- Hyderabad Prajavani: ప్రజావాణిలో వచ్చిన విన్నపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

