Allu Arjun Review: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా చూసిన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సినిమా ను పొగడ్తలతో ముంచెత్తారు. దీనిని సంబంధించి తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. ‘ధూరందర్’ (Dhurandhar) చిత్రం కేవలం ఒక సినిమా కాదు, అది చక్కటి నటన, అత్యుత్తమ సాంకేతిక విలువలు, మరియు అద్భుతమైన సంగీతం కలగలిసిన ఒక దృశ్య కావ్యం. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పాలంటే, ఇది ఒక బ్రిలియంట్‌గా తీసిన సినిమా అని చెప్పక తప్పదు. దర్శకుడు ఆదిత్య ధర్ (AdityaDharFilms) తన దర్శకత్వంతో మరోసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తన సత్తా చాటారు.
Read also-Dhurandhar Gulf Ban: రణవీర్ సింగ్ సినిమాకు ఆ దేశాల్లో ఎదురు దెబ్బ.. ప్రదర్శనకు నో పర్మిషన్..
నటీనటుల ప్రదర్శన
‘ధూరందర్’ సినిమాకు ప్రధాన ఆకర్షణ దానిలోని నటీనటుల ప్రదర్శన. నా సోదరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రణవీర్ సింగ్ ఈ చిత్రంలో మ్యాగ్నెటిక్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. అతని నటనలోని కొత్తదనం, పాత్రను తనదైన శైలిలో పోషించిన విధానం అద్భుతం. నిజంగా అతను తన బహుముఖ ప్రజ్ఞతో షో అంతటినీ తన భుజాలపై మోశాడు. అలాగే, అక్షయ్ ఖన్నా గారి కర్కశమైన, ఆకర్షణీయమైన అభినయం ఈ సినిమాకు మరో బలం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి సన్నివేశానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇక సంజయ్ దత్ రాక్-సాలిడ్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత్రకు ఉన్న బలం, ఆయన నటన ద్వారా మరింత పెరిగింది. వీరితో పాటు, మాధవన్ గారు, అర్జున్ రాంపాల్, ఇతర కళాకారులందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి, సినిమా స్థాయిని పెంచారు. ముఖ్యంగా, సారా అర్జున్ కూడా తన స్వీట్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి నటుడు ఒక పటిష్టమైన టీమ్‌గా కలిసి పనిచేసి, ఈ చిత్రాన్ని ఒక గొప్ప సినిమాగా నిలబెట్టారు.
Read also-Bharani Exit: బిగ్ బాస్ పోరు నుంచి భరణి అవుట్.. ‘కీ టూ సక్సెస్’ టాస్క్‌లో పాపం ఇమ్మానియేల్..
సాంకేతిక విలువలు
సినిమాకు వెన్నుముకగా నిలిచే సాంకేతిక అంశాలు ఈ చిత్రంలో అత్యున్నతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్, విజువల్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రతి విభాగంలోనూ టెక్నీషియన్స్ తమ అత్యుత్తమ పనితీరును కనబరిచారు. నేపథ్య సంగీతం, పాటలు అమేజింగ్‌గా ఉన్నాయి. అవి కథా గమనాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళాయి. ఈ గొప్ప ప్రాజెక్ట్‌ను రూపొందించినందుకు గాను, జ్యోతి దేశ్‌పాండేతో పాటు జియో స్టూడియోస్ నిర్మాణ సంస్థకు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుతమైన విజయానికి ప్రధాన కారకుడు, ఈ చిత్ర నౌకకు కెప్టెన్ అయిన దర్శకుడు ఆదిత్య ధర్. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ తర్వాత, ఆయన మరోసారి తన అద్భుతమైన ఫిల్మ్‌మేకింగ్ తో మెప్పించారు. ఆయన ఈ చిత్రాన్ని ఏస్ ఫిల్మ్‌మేకర్‌గా, ఫుల్ స్వాగ్‌తో అద్భుతంగా తీశారు. సినిమా చూస్తున్నంత సేపు ఆయన విజన్, ఆయన టేకింగ్ ఆకట్టుకుంటాయి. అంటూ సినిమాపై తన రివ్యూను రాసుకొచ్చారు. దీనిని చూసిని రణవీర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మంచి సినిమాకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని వారు ఆకాక్షిస్తున్నారు.
Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.
Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.
Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025

