Bharani Exit: బిగ్ బాస్ పోరు నుంచి భరణి అవుట్..
big-boss-9961
ఎంటర్‌టైన్‌మెంట్

Bharani Exit: బిగ్ బాస్ పోరు నుంచి భరణి అవుట్.. ‘కీ టూ సక్సెస్’ టాస్క్‌లో పాపం ఇమ్మానియేల్..

Bharani Exit: బుల్లి తెర ప్రేక్షకులను అమితంగా ఆకర్షించే రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 9’. తాజాగా ఈ రియాలిటీ షోకి సంబంధించి 96 వ రోజు ప్రోమోను విడుదల చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ఏం జరగబోతుందో తెలుస్తుంది. ఇప్పటికే ఈ రోజు ప్రోమో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ప్రోమోలో.. తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా భరణి తర్వాత వచ్చే టాస్క్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం భరణికి బిగ్ బాస్ తెలపడంతో భరణి ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కొంత సేపటి తర్వాత కోలుకున్న భరణి తన దగ్గర ఉన్న పాయింట్లను ఎవరికి ఇస్తున్నావు అని బిగ్ బాస్ ప్రశ్నించగా భరణి ఆలోచించుకుని తనూజకు ఇస్తాను అంటూ సమాధానం చెప్పారు, దీంతో తనూజ ఎమోషనల్ అయ్యారు. తర్వాత కొంత సేపటికి బిగ్ బాస్ హౌస్ మొత్తం సైలెంట్ గా ఉండిపోయింది. మిగిలిన ముగ్గురు.. ఇమ్మానియేల్, తనూజ, సంజనలు తర్వాత టాస్క్ ఆడటానికి సిద్దం అయ్యారు. వారి ముగ్గురికీ బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత టాస్క్ ఏంటంటే? ‘కీ టూ సక్సెస్’ ఇందులో కీ ఉపయోగించి విజయం పొందాలి.

Read also-Rajinikanth Journey: ‘తలైవా’కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.. ప్రధాని మోదీ ఏం అన్నారంటే?

బిగ్ బాస్ లో 96 రోజు సభ్యులకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే? కీ టూ సక్సెస్.. ఈ టాస్క్ లో టేబుల మీద ఉన్న కీస్ తీసుకుని స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఆర్టికల్స్ తీసుకుని అక్కడే బయట ఉంచిన అమరికల్లో అమర్చాలి. అలా ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో వారు ముందు వరుసలో ఉంటారు. ఈ గేమ్ ఆడటానికి మిగిలిన ముగ్గురూ సిద్దం అయ్యారు. ఒక్కొక్కరూ ఒక్క సారి మాత్రమే ఒక్క కీ తీసుకుని పూల్ లోకి దిగాలి.  ఇలా ఎవరైతే ఎక్కువ అమరికలు అమరుస్తారో.. వారు గెలిచినట్లు..  ఈ గేమ్ లో ఒకరు అమర్చుకునన అమరికలను కూడా వేరేవారు తీసివేయవచ్చు.. దీంతో ఇమ్మానియేల్ అమరికలను మిగిలిన ఇద్దరూ తీసేస్తుంటారు.. ఇమ్మానియేల్ కు వెనుక నుంచి డిమాన్ వవన్ సూచనలు ఇస్తుంటాడు. ఇది చూసిన భరణి డీమాన్ కి వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఎవరు ఎక్కువ అమరికలు అమర్చారు. అక్కడ ఏం జరిగిరంది. తెలుసుకోవాలి అంటే సాయంత్రం వరకూ ఆగాాల్సిందే.

Read also-Akhanda2 Review: బాలయ్య బాబు ‘అఖండ 2 తాండవం’తో పూనకాలు తెప్పించారా?.. ఫుల్ రివ్యూ..

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు