GHMC Ward Delimitation: మజ్లిస్ కోసమే కొత్త వార్డులు
GHMC Ward Delimitation ( image credit: swetcha reporter)
Political News, హైదరాబాద్

GHMC Ward Delimitation: మజ్లిస్ కోసమే కొత్త వార్డులు.. ప్రజాభిప్రాయం తీసుకోరా? ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం!

GHMC Ward Delimitation: జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల డీలిమిటేషన్‌పై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు నెలకున్నాయి. డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ తొలి రోజైన కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు పునర్విభజన జరుగుతున్న తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే. అభ్యంతరాల స్వీకరణ రెండో రోజైన  కూడా బీజేపీ, ఎంఐఎం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కమిషనర్‌ను కలిసి పునర్విభజన శాస్త్రీయంగా జరగటం లేదని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ, వార్డుల పునర్విభజన ప్రక్రియపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఎంఐఎం (మజ్లిస్) పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ హడావుడి నిర్ణయం తీసుకుందని ఆరోపించింది.  బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నేతృత్వంలోని బృందం  జీహెచ్ఎంసీ కమిషనర్‌ కర్ణన్ ను కలిసింది. వార్డుల విభజన, విలీన ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ప్రజాభిప్రాయాలు తీసుకోలేదు

మర్రి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్‌పై ప్రజాభిప్రాయాలు తీసుకోకుండానే ఏకపక్షంగా చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. కమిషనర్‌ను కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ 650 చదరపు కిలోమీటర్ల పరిధి ఉన్న గ్రేటర్‌ను ఏకంగా 2 వేల కిలోమీటర్లకు పెంచారన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక వర్గానికి న్యాయం చేసేందుకే ఈ తంతు నడిపారని ఆయన మండిపడ్డారు. కేంద్రానికి వార్డు సెన్సస్ ఇవ్వాలనే సాకుతో కమిషనర్ ఇప్పుడు ఈ పని చేశారని అన్నారు. వార్డులకు సంబంధించిన మ్యాపులు ఎక్కడా లేవని, వెంటనే మ్యాప్స్, పాత 150 వార్డుల జనాభా, కొత్త వార్డుల ఓటర్ల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని అధికారులు చెప్పారని ఆయన వెల్లడించారు.

Also Read: Arunachal Pradesh Accident: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోరం.. లోయలో ట్రక్కు పడి 22 మంది కూలీల మృతి.. బతికిన ఒకే వ్యక్తి నడుచుకుంటూ వెళ్లి..

ఇదేమైనా బహుబలి సినిమానా?

మాజీ ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం చూస్తుంటే ఇది బాహుబలి పార్ట్ 1ను సినిమానా? అని కమిషనర్‌ను అడిగామన్నారు. మజ్లిస్ గెలుపు కోసమే ప్రభుత్వం కుమ్మక్కై కొత్త వార్డులను తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రజలపై పన్నుల భారం ఎలా వేస్తారో చెప్పాలని నిలదీశారు. తాము ప్రత్యేక కమిటీలు వేసుకుని, 17వ తేదీ లోపు కమిషనర్‌కు తమ నివేదికను అందజేస్తామన్నారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ఎప్పుడూ మహానగరాన్ని మంచి నగరంగా చూడాలనుకుంటుందని, కానీ ప్రభుత్వం నిరంకుశంగా విలీన నిర్ణయం తీసుకుందన్నవారు. వార్డులు, జోన్లు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మాకున్న అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. విస్తరణం పేరుతో వసతులు కల్పించకుండా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించినట్లు తెలిపారు.

Also Read: GHMC BJP: జీహెచ్‌ఎంసీలో వార్డుల డీలిమిటేషన్‌పై భగ్గుమన్న బీజేపీ.. అభ్యంతరాలు ఇవే

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క