Jogipet Hospital: ఒక్క రోజే 20 మంది డుమ్మా కొడతారా?
Jogipet Hospital ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jogipet Hospital: ఒక్క రోజే 20 మంది డుమ్మా కొడతారా? జోగిపేట ఆసుపత్రి డాక్టర్లకు డీసీహెచ్‌ఎస్‌ వార్నింగ్‌!

Jogipet Hospital: ఒక్క రోజే 20 మంది డాక్టర్లు డుమ్మా కొడతారా? ఇది ప్రభుత్వ ఆసుపత్రియా లేక ఇంకా ఏమైనా అనుకున్నారా? సాక్షత్తు వైద్య మంత్రి నియోజకవర్గంలో ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారా? అంటూ డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎండీ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతి రోజు డాక్టర్లంతా విధులకు హజరు కానట్లయితే చర్యలు తప్పవని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్లకు హెచ్చరించారు. బుధవారం జోగిపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో కేవలం ఇద్దరు మాత్రమే విధులకు హజరు కావడం 11 మంది డాక్టర్లకు షోకాజ్‌లు జారీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Also ReadWarangal News: కడుపులో ఉండగానే.. చంపేస్తున్నారు.. చర్యలుంటాయా? ఉండవా?

2 గంటల వరకు డాక్టర్లు అవుట్‌

కలెక్టర్‌ ఆదేశానుసారం డాక్టర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసామని, అందుకు తిరిగి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని, విధులను సక్రమంగా నిర్వహిస్తామని డాక్టర్లు సూచించారని డీసీహెచ్‌ఎస్‌ సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్వంత నియోజకవర్గ కేంద్రంలోని ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు ఇలా ఉంటే ఎలా అని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు డాక్టర్లు అవుట్‌ పేషెంట్లకు అందుబాటులో ఉండాలన్నారు.

ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలి

సుమారు గంటన్నర సేపు డాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని, మీ పనితీరుపై జిల్లా కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన తెలియజేసారు. ప్రతి రోజు 22 మంది డాక్టర్లు విధుల్లో పాల్గొనాలని, సెలవుపై వెళితే ముందే సమాచారం ఇవ్వాలన్నారు. ఆసుపత్రిలో మందుల కొరతలేదని, సౌకర్యాల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ సౌజన్యతో పాటు 20 మంది డాక్టర్లు విధులకు హజరైనట్లు డీసీహెచ్‌ఎస్‌ తెలిపారు.

Also Read: Jogipet: జోగిపేట చైన్ స్నాచింగ్ కేసు.. 12 గంటల్లో చేదించిన పోలీసులు!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క