Jogipet: జోగిపేట చైన్ స్నాచింగ్ కేసు.. 12 గంటల్లో పోలీసులు!
Jogipet ( image credit: swetcha reporter)
Telangana News, నార్త్ తెలంగాణ

Jogipet: జోగిపేట చైన్ స్నాచింగ్ కేసు.. 12 గంటల్లో చేదించిన పోలీసులు!

Jogipet: జోగిపేట పట్టణంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసును స్థానిక పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. పట్టణంలోని సత్యసాయి కాలనీలో రిటైర్డ్ టీచర్ సదాశివగౌడ్ అత్త అయిన శంకరంపేట మాణెమ్మ మెడలోంచి దొంగిలించబడిన నాలుగు తులాల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోగిపేట సీఐ అనిల్‌ కుమార్‌, ఎస్ఐ పాండుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.

 Also Read: Jogipet: జోగిపేటలో పట్టపగలు చోరీ.. మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన దొంగ!

పోలీసులు వెంటనే రంగంలోకి

ఉదయం పూట బాధితురాలు మాణెమ్మ మందుల కోసం మెడికల్ షాపునకు వెళ్లింది. స్థానిక హనుమాన్ చౌరస్తా వద్ద ఆమెను గమనించిన నిందితుడు వెంబడించాడు. మహిళ సత్యసాయి కాలనీలోని తన ఇంట్లోకి వెళ్లగానే, వెనకాలే వెళ్లిన దొంగ ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని, వెంటనే ఆమె కళ్లలో కారం చల్లి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. అనంతరం నిందితుడు ఎస్సీ కాలనీ మీదుగా క్రీడా మైదానంలోకి పరుగెత్తి జనంలో కలిసిపోయాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అందోలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నవీన్‌గా గుర్తించారు.

బంగారు గొలుసును అదే రోజు రాత్రి పోలీసులు స్వాధీనం

సంఘటన జరిగిన రోజే రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం చేసినట్లుగా అంగీకరించాడు. దొంగిలించబడిన బంగారు గొలుసును అదే రోజు రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నవీన్ డిప్లొమా పూర్తి చేసి, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, పటాన్‌చెరువు ప్రాంతాల్లో బిల్డర్ల వద్ద సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా అతడికి 14 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని నవీన్ దొంగతనానికి పాల్పడటం అతడి స్నేహితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ కేసు ఛేదింపులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ పాండు, ఐడీ పార్టీ కానిస్టేబుల్‌ అరవింద్, సంజీవ్, సురేశ్‌ను సీఐ అనిల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా పోలీసు బృందానికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందినట్లు తెలిపారు.

 Also Read: Jogipet CI: జోగిపేట సీఐ పిస్టల్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌‌కు తప్పిన ప్రమాదం

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?