AI Copyright: ఆన్లైన్ లో ఉన్నదంతా AI తీసుకుంటుందా?
AI ( Image Source: Twitter)
Technology News

AI Copyright: ఇంటర్నెట్ డేటా మొత్తం AIకి ఓపెన్ అవుతోందా?

AI Copyright: దేశంలో జనరేటివ్ AI కోసం DPIIT కొత్త డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే.. ఇంటర్నెట్‌లో ‘చట్టబద్ధంగా యాక్సెస్’ చేసిన ఏ కంటెంట్ అయినా AI మోడల్స్ ట్రైనింగ్‌కి వాడొచ్చని సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ప్లాట్‌ఫామ్ పేవాల్ పెట్టకపోతే, కంటెంట్ effectively AI ట్రైనింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.

నిపుణుల మాట ఇది ఇంటర్నెట్ కాపీరైట్ వ్యవస్థను మార్చే అవకాశం ఉంది. “పబ్లిక్‌గా కనిపించే కంటెంట్ కూడా కాపీరైట్ రక్షణలోనే ఉంటుంది. ఉచితంగా ఉండటం వలన అది ఫ్రీగా AI కి వెళ్తుందన్నది సరికాదు,” అని సీనియర్ అసోసియేట్ పల్లవి సోంధీ పేర్కొన్నారు.

Also Read: Akhanda 2 Thaandavam: బాలయ్య అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి..

డ్రాఫ్ట్ “One Nation One Licence One Payment” పేరుతో వస్తుంది. ఇందులో AI డెవలపర్లు ‘ చట్టబద్ధంగా యాక్సెస్ చేసిన’ కంటెంట్ ఆధారంగా ట్రైనింగ్ చేయవచ్చు. దీనికి CRCAT (Copyright Royalty Collection and Allocation Tribunal) అనే కొత్త వ్యవస్థను ప్రతిపాదించారు. కంటెంట్ కనిపించడం సరిపోతుంది. అదే యాక్సెస్ అని తీసుకుని AI కోసం వాడొచ్చని మోడల్ సూచిస్తోంది.

Also Read:  TG Global Summit: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లోని పూర్తి అంశాలు.. ప్రణాలికలు ఇవే..!

అయితే, దీని వల్ల AI డెవలపర్లపై ఎక్కువ బరువు పడే అవకాశం ఉంది. “ ప్రతి ఏడాది గ్లోబల్ రెవెన్యూ రిపోర్ట్ చేయాలి, ఫిక్స్‌డ్ రాయల్టీలు చెల్లించాలి, CRCAT బోర్డులో చిన్న క్రియేటర్లకు సరైన ప్రాతినిధ్యం లేదు,” అని ది డైలాగ్ అసోసియేట్ డైరెక్టర్ జమీలా సహీబా తెలిపారు. ఆమె చెప్పినట్టే, ఈ విధానం చిన్న క్రియేటర్లకు పెద్ద లాభం ఇస్తుందని ప్రపంచంలో ఎక్కడా ఉదాహరణలు లేవు.

Also Read: Indian Rice Imports: భారత్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ట్రంప్.. బియ్యం దిగుమతులపై టారిఫ్ విధిస్తామని హెచ్చరిక

ఇంకా, ప్లాట్‌ఫామ్‌లు స్క్రాపింగ్ ఆపాలంటే, ఉల్లంఘనలను గుర్తించడం, పర్యవేక్షించడం కీలకం. “ రూల్స్ పెట్టినా, violations గుర్తించలేకపోతే ఉపయోగం ఉండదు,” అని పల్లవి సోంధీ గుర్తు చేశారు. దీంతో కొత్త AI కాపీరైట్ డ్రాఫ్ట్‌ను పూర్తిగా అమలు చేయడం సవాలుగా మారుతుంది.

Just In

01

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం