Mahesh Kumar Goud: పంచాయతీ ఎన్నికల్లో ఇదే జరుగుతుంది
Mahesh Kumar Goud (imagecredit:swetcha)
Political News, Telangana News

Mahesh Kumar Goud: పంచాయతీ ఎన్నికల్లో సేమ్ ఇదే జరుగుతుంది: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: ఇప్పటి వరకు ఏకగ్రీవమైన సర్పంచుల్లో 90 శాతం కాంగ్రెస్ మద్దతుదారులే ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ, తన స్వగ్రామం రహత్ నగర్‌లో ఎస్టీ అభ్యర్థి విద్యావంతుడు తిరుపతి(Thirupathi) ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం శుభ పరిణామం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం పట్ల సంతృప్తితో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు.

Also Read: CM Revanth Convoy: సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం.. రేవంత్‌కు త్రుటిలో తప్పిన ముప్పు

ఊహించని విధంగా పెట్టుబడులు..

సన్న బియ్యం మొదలు ఇందిరమ్మ ఇళ్ల వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌తో ఊహించని విధంగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఫోర్త్ సిటీ చారిత్రాత్మక నిర్ణయం కాబోతున్నదని, ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఫోర్త్ సిటీని నిర్మిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రఖ్యాతి చెందిన కంపెనీలు పాల్గొన్నాయని, పెట్టుబడులు రావడం శుభ పరిణామం అని అన్నారు. పదేళ్ల విధ్యంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పయనిస్తున్నదని చెప్పారు. సకల సదుపాయాలతో ఫోర్త్ సిటీ ముందుకు సాగుతున్నదన్నారు. విద్యావంతులు, యువకులు సర్పంచులుగా ఎన్నిక కావడం మంచి పరిణామం అని మహేశ్ గౌడ్ చెప్పారు.

Also Read: Minister Sridhar Babu: భారత్ ఫ్యూచర్ సిటీతో.. 13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క