CM Revanth Convoy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని జామర్ వాహనం టైరు ఒక్కసారిగా పేలిపోయింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రింగ్ రోడ్డు (ORR)లోని ఎగ్జిట్ 17వ వద్ద కాన్వాయ్ ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే జామర్ వాహనం డ్రైవర్ అప్రమత్తంగా వ్యహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన కాన్వాయ్ నుంచి జామర్ వాహనాన్ని పక్కకు తీసుకొచ్చారు. కాగా విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. జామర్ వాహనం టైర్ మార్చి అవసరమైన మరమ్మత్తులు చేయించారు.
ఈ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి సహా కాన్వాయ్ లోని ఇతర వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే జామర్ వాహనానికి స్టెప్నీ టైర్ ను అమర్చినట్లు చెప్పారు. పూర్తి మరమ్మతులు అనంతరం జామర్ వాహనం తిరిగి కాన్వాయ్ లోకి చేరినట్లు స్పష్టం చేశారు.
Also Read: Plane Crash: కుప్పకూలిన విమానం.. 90 గ్రామాల్లో పవర్ కట్.. అసలేం జరిగిందంటే?
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో కాన్వాయ్‌లోని వాహనాల భద్రత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

