Minister Sridhar Babu: భారత్ ఫ్యూచర్ సిటీతో.. ఉద్యోగ అవకాశాలు!
Minister Sridhar Babu (image Credit: swetcha reporter)
Telangana News

Minister Sridhar Babu: భారత్ ఫ్యూచర్ సిటీతో.. 13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు!

Minister Sridhar Babu: భారత్ ప్యూచర్ సిటీతో 13లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. అద్భుతమైన మౌలిక వసతులతో ఏర్పాటయ్యే ఈ నగరాన్ని 13,500 ఎకరాలలలో జీరో కార్బన్ సిటీగా రూపొందించనున్నట్టు తెలిపారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ, యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ డాలర్స్ తెలంగాణ’ అనే అంశంపై ప్రభుత్వ ప్రణాళికలను మంగవారం గ్లోబల్ సమ్మిట్ లో వివరించారు. భవిష్యత్ నగరాని ఆరు అర్బన్ జిల్లాలుగా అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్ టెయిన్ మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల జిల్లాలుగా మొత్తం ఆరింటిని నెలకొల్పనున్నట్టు తెలిపారు.

13 లక్షల మందికి ఉద్యోగాలు 

ఏర్పాటయ్యే వివిధ పరిశోధన సంస్థలు, గ్రీన్ ఫార్మా, మ్యాన్యుఫాక్చరింగ్, ఎంటర్ టెయిన్ మెంట్ జోన్ల ద్వారా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, 9 లక్షల జనాభా కోసం నివాస గృహాల సముదాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మాణరంగంలో ఉన్నవారు వీటిని అభివృద్ధి చేస్తారని, మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలు కేటాయిస్తున్నామన్నారు. వచ్చే ఫిబ్రవరి చివరలో ఇక్కడ నిర్మాణాలు మొదలవుతాయన్నారు. ఎంటర్ టెయిన్ మెంట్ జోన్ (డిస్ట్రిక్ట్ ) లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కన్ వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.

అడ్వెంచర్ కేంద్రాలు, స్టార్ హోటళ్లు నిర్మిస్తామని, ఫ్యూచర్ సిటీ అంతా ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తు అవసరాలకు సరిపోయే అత్యాధునిక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అర్భన్ ఫారెస్టులతో అంతా పచ్చదనం పర్చుకుని కనిపిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జీరో కార్బన్ సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా భాసిల్లుతుందన్నారు. ప్రతి వర్షం చుక్క ఇక్కడే ఇంకిపోయేలా రెయిన్ హార్వెస్టింగ్ జరుగుతుందని, భూగర్భ జలాలకు కొదవ లేకుండా చేస్తామన్నారు. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో నూతన పరిశోధనలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.63 వేల కోట్ల పెట్టుబడులు

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమల అనుకూల విధానాలతో గడచిన రెండేళ్లలో ఒక్క లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.63 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యూచర్ సిటీపై జరిగిన చర్చాగోష్ఠిలో ప్రసంగించారు. తెలంగాణా గ్లోబల్ వ్యాక్సిన్స్ కేంద్రంగా గా అవతరించిందన్నారు. వంద బిలియన్ డాలర్ల విలువైన 2వేల ఫార్మా కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రపంచంలో 10 పెద్ద ఫార్మా కంపెనీల్లో 8 తెలంగాణాలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల తీసుకున్న నిర్ణయాలను, విధానాలను కొనసాగిస్తూ పారిశ్రామిక రంగానికి ఏ ఆటంకాలు లేకుండా చూస్తున్నట్టు చెప్పారు.

లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు

గత 30 ఏళ్లుగా పాత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాల కొనసాగింపు జరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇండస్ట్రీ పెద్దల భాగస్వామ్యంతో నిపుణులైన వర్క్ ఫోర్స్ ను తయారు చేస్తామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కూడా పరిశ్రమల భాగస్వామ్యంతోనే ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రెండు బ్యాచ్ ల విద్యార్థులకు శిక్షణనిచ్చి ఉద్యోగావకాశాలు కల్పించిందని తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్తు కొరత లేకుండా కొత్త గ్రీన్ ఎనర్జీని పాలసీని తమ ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు.

Also Read: Minister Sridhar Babu: తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు

బ్లూ  గ్రీన్ ఎకానమీ” క్యాపిటల్ గా తెలంగాణ.. భావితరాల కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం

తెలంగాణను ‘బ్లూ – గ్రీన్ ఎకానమీ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా ఓ వైపు బ్లూ, గ్రీన్ ఎకానమీకి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే మరోవైపు మూసీ పునరుజ్జీవనం, హైడ్రా, నెట్ జీరో సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి దార్శనికతతో కూడిన విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో భాగంగా రెండో రోజు మంగళవారం ‘మూసీ పునరుజ్జీవనం అండ్ బ్లూ – గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో మాట్లాడారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తేనే సరిపోదని, ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, పర్యావరణాన్ని కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. అందుకోసం ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి వస్తుందన్నారు.

మూసీ ప్రక్షాళనకు శ్రీకారం

భావితరాల కోసమే కాలుష్యంతో కంపు కొడుతున్న మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. గోదావరి నీటిని మూసీకి తరలించి గొప్ప జీవనదిగా మార్చేలా బృహత్తర ప్రణాళికలు రూపొందించామన్నారు. చెరువులు, కుంటలను కబ్జా కోరల్లో నుంచి రక్షించి వాటికి పునరుజ్జీవనం కల్పించాలనే సంకల్పంతోనే ‘హైడ్రా’కు శ్రీకారం చుట్టామన్నారు. మొదట్లో ‘హైడ్రా’పై అనుమానాలు వ్యక్తం చేసిన వారే ఇప్పుడు మమ్మల్ని అభినందిస్తున్నారన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. “కొత్వాల్ గూడ”లో 85 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎకో పార్కు అరుదైన 19 రకాలకు చెందిన 8 వేల పక్షులకు ఆవాసంగా మారిందన్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ లో “బ్లూ – గ్రీన్ ఎకానమీ”కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

Also Read: Minister Sridhar babu: ఏఐతో ఉద్యోగాలు పోతాయా.. ఇది కేవలం అపోహే: మంత్రి శ్రీధర్ బాబు

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!