Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కీలక ప్రకటన
Ram-Mohan-Naidu-Kinjarapu (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

Indigo Crisis: ఇండిగో విమాన సర్వీసుల్లో ఇంకా అంతరాయాలు (Indigo Crisis) కొనసాగుతున్నాయి. ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) మంగళవారం (డిసెంబర్ 9) లోక్‌సభ వేదికగా (Lok Sabha) కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఏ విమానయాన సంస్థనూ కేంద్ర ప్రభుత్వం (Central Govt) అనుమతించబోదని, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని, ప్రయాణికుల సేఫ్టీ విషయంలో ఎలాంటి చర్చకు తావులేదని పేర్కొన్నారు. ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని రామ్మోహన్ నాయుడు లోక్‌సభకు తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో రద్దీ తగ్గిపోయి, ప్యాసింజర్లు ఇబ్బందిపడని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టుగ రిపోర్టులు అందుతున్నాయని తెలిపారు. రద్దైన విమానాలకు సంబంధించి రిఫండ్, లగేజీల గుర్తింపు, ప్రయాణీకులకు సాయానికి సంబంధించిన చర్యలను పౌరవిమానయాన శాఖ నిరంతర పర్యవేక్షిస్తోందని ఆయన వివరించారు. జవాబుదారీతనం ఉండేలా తప్పకుండా వ్యవహరిస్తామని ఆయన స్పష్టత ఇచ్చారు.

Read Also- Tarun Bhascker: తరుణ్ భాస్కర్ అలా అనేశాడేంటి భయ్యా .. సీరియస్ అయిన ఫిలిం జర్నలిస్ట్.. ఎందుకంటే?

డీజీసీఏ (DGCA) ఇప్పటికే ఇండిగో సీనియర్ మేనేజ్‌మెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, సమగ్రమైన దర్యాప్తును ప్రారంభించిందని గుర్తుచేశారు. దర్యాప్తు ఫలితాన్ని బట్టి రూల్స్, చట్టాల ప్రకారం కఠినమైన, తగిన చర్యలు ఉంటాయని ఆయన లోక్‌సభకు వివరణ ఇచ్చారు. ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినా నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని, ఉల్లంఘనకు పాల్పడడానికి అనుమతి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో వైఫల్యాలు, చట్టబద్ధమైన మార్గాలను అనుసరించకపోవడాన్ని ఉపేక్షించబోమని రామ్మోహన్ నాయుడు చెప్పారు. అత్యున్నత స్థాయి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటించేందుకు భారత్ దృఢనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇండిగో సిబ్బంది సంక్షోభానికి కేంద్ర బిందువుగా ఉన్న విమాన డ్యూటీ సమయ పరిమితుల సవరణ శాస్త్రీయంగా చేశారని, పైలట్ల అలసటను తగ్గించేందుకు వీటిని రూపొందించినట్టు ఆయన గుర్తుచేశారు. ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని, కేంద్రం చేపట్టిన ఈ సంస్కరణలు ప్యాసింజర్ల భద్రతను పెంచడానికి ఉద్దేశించినవి ఆయన వివరించారు.

Read Also- Champion Song: రోషన్ ‘ఛాంపియన్’ నుంచి ‘సల్లంగుండాలి’ సాంగ్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి మరి..

దశల వారీగా అమలు

కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను డీజీసీఏ సంబంధిత భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు జరిపిన తర్వాత, దశల వారీ అమలు ప్రణాళికను తీసుకొచ్చిందని రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు. మొదటి దశ ఈ ఏడాది జూలై 1 నుంచి, రెండో దశ నవంబర్ 1 నుంచి మొదలయ్యాయని వివరించారు. ఈ రూల్స్‌ను సంపూర్ణంగా పాటిస్తామంటూ ఇండిగో హామీ ఇచ్చిందని, షెడ్యూల్ కూడా సిద్దంగా ఉందంటూ ధృవీకరించిందని, అయినప్పటికీ రోస్టరింగ్ సమస్యల కారణంగా విమానాల రద్దు వరకు దారితీసిందని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పటిష్టమైన, పోటీతత్వంతో కూడిన ఒక విమానయాన పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

సకాలంలో రిఫండ్

ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ప్యాసింజర్ల ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వివరణ ఇచ్చారు. ఇక, ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమాన టికెట్ రేట్లు భారీగా పెరిగిపోవడంపై స్పందిస్తూ, అవకాశవాద ధరల పెరుగుదలపై పరిమితులు విధించామని ఆయన గుర్తుచేశారు. ఆకస్మికంగా ఏర్పడిన డిమాండ్ ఏ ప్రయాణీకుడు కూడా దోపిడీకి గురికాకుండా కేంద్రం జోక్యం చేసుకుందని లోక్‌సభకు ఆయన వివరించారు. రిఫండ్ త్వరగా ఇవ్వాలంటూ ఇండిగోను ఆదేశించామని, ఇప్పటికే రూ.750 కోట్లకు పైగా ప్యాసింజర్లు రిఫండ్ పొందారని చెప్పారు. కాగా, ప్రతిరోజూ వందలాది విమానాలు రద్దు చేసి, వేలాది మంది ప్యాసింజర్లు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయేలా వ్యవహరించిన దేశీయ ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోపై చర్యలు తీసుకునే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది.

Just In

01

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం