Lakeshore Mall: హైదరాబాద్ లో మెగా సూపర్ మాల్
HYD MALL ( Image Source: Twitter)
Telangana News, హైదరాబాద్

Lakeshore Mall: హైదరాబాద్ లో రూపుదిద్దుకుంటున్న మెగా సూపర్ మాల్… నగరంలోనే అతి పెద్దది

Lakeshore Mall: హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ తాజాగా దేశంలోని టాప్ 5 అతిపెద్ద మాల్స్ జాబితాలో చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది. దీంతో సిటీ రిటైల్ రంగంపై మరోసారి దృష్టి పడుతున్న సమయంలో, నగరం ఇప్పుడు మరింత భారీ షాపింగ్ ల్యాండ్‌మార్క్‌కు నిలవబోతోంది అదే లేక్‌షోర్ మాల్. కూకట్‌పల్లిలో వేగంగా పూర్తి అవుతున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 12న ప్రారంభం కానుంది. విస్తీర్ణం, డిజైన్, లొకేషన్ మూడు అంశాల్లోను భారీగా నిలిచే ఈ మాల్, హైదరాబాద్‌కి షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొత్త ప్రమాణాలను తీసుకురానుందని అంచనా.

Also Read: Modi Vs Priyanka: ‘వందేమాతరం’పై లోక్‌సభలో హోరాహోరీ చర్చ.. నెహ్రూపై మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ పదునైన కౌంటర్లు

లేక్‌షోర్ మాల్ గురించి ఇప్పటికే వెలువడిన వివరాలు చూసుకుంటే, ఇది ఎందుకు ఇంత పెద్ద చర్చకు కారణమవుతోందో అర్థమవుతుంది. 1.66 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో రూపుదిద్దుకుంటున్న ఈ మాల్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కంటే సుమారు 32% పెద్దది, ఇనార్బిట్ మాల్ కంటే దాదాపు రెండింతలు పెద్దదిగా ఉండనున్నట్లు ASBL ల్యాండ్‌మార్క్ తెలిపింది. అధికారులు అధికారిక సంఖ్యలను ఇంకా ధృవీకరించకపోయినా, ప్రస్తుతం ఉన్న అంచనాలే హైదరాబాదీలలో భారీ అంచనాలను సృష్టిస్తున్నాయి.

Also Read: Telangana: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం

డిసెంబర్ 12న గ్రాండ్ ఓపెనింగ్ జరుగనుండగా, ఇందులో 100కిపైగా షోరూ‌మ్స్, దేశీయ అంతర్జాతీయ బ్రాండ్ల బలమైన కలయిక ఉండబోతోంది. ఇప్పటికే H&M, లైఫ్‌స్టైల్, స్టార్‌బక్స్, మ్యాక్స్ వంటి పెద్ద పేర్లు కన్‌ఫర్మ్ కాగా, మరిన్ని ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, టెక్, ఫుడ్ & బేవరేజెస్ బ్రాండ్లు జాబితాలో చేరనున్నాయి. వినోదంలో పెద్ద ఆకర్షణగా PVR P[XL] స్క్రీన్ రూపుదిద్దుకుంటోంది హైదరాబాదులో ఇది రెండో P[XL] థియేటర్, మొదటిది ఇనార్బిట్ మాల్‌లో ఉంది. కూకట్‌పల్లి బాలానగర్ మెట్రో స్టేషన్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యే ప్రత్యేక ప్రవేశం ఉండటం కూడా ఈ మాల్‌కి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది.

Also Read: Illegal Registrations: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. రిజిస్ట్రేషన్ చేయాలంటే చేతులు తడపాల్సిందే.. లేదంటే ముప్పు తిప్పలు

అయితే, ఈ భారీ ప్రాజెక్ట్‌పై నగరవాసుల్లో మరో కోణంలో చర్చ నడుస్తోంది. ట్రాఫిక్‌పై ప్రభావం. లేక్‌షోర్ మాల్ ప్రారంభంతో కూకట్‌పల్లి ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సమస్యలు మరింత పెరగవచ్చని అనేకమంది హైదరాబాదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాల్ ప్రారంభం దగ్గర పడుతున్న కొద్దీ, రాబోయే రోజుల్లో కూకట్‌పల్లి–బాలానగర్ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ ఎలా ఉంటుందో అనే ప్రశ్నకు నగర ప్రజలు సమాధానం ఎదురుచూస్తున్నారు.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం