Crime News: కత్తితో గొంతు కోసి మరదలిని చంపిన మేన బావ
Crime News (imagecredit:swetcha)
క్రైమ్, హైదరాబాద్

Crime News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. అతి దారుణంగా కత్తితో గొంతు కోసి మరదలిని చంపిన బావ

Crime News: కత్తితో గొంతు కోసం మరదలిని కిరాతకంగా హత్య చేశాడు మేన బావ. అదీ హతురాలి తల్లిదండ్రులు చూస్తుండగానే. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం వారాసిగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. బాపూజీనగర్​ వాస్తవ్యులైన లక్ష్మీ, కాంతారావు భార్యాభర్తలు. వీరి కూతురు పవిత్ర (17) ఇంటర్మీడియెట్​ విద్యార్థిని. ఇదిలా ఉండగా పవిత్ర(Pavuthra)కు మేన బావ అయ్యే ఉమా శంకర్(Uma Shankar) కొన్నిరోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతూ వస్తున్నాడు. ఇదే విషయాన్ని లక్ష్మీ, కాంతారావులకు కూడా చెప్పాడు.

Also Read: Bigg Boss 9 Telugu: ప్రోమో అదిరింది.. పోగొడుతూనే హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్

నన్ను వివాహం చేసుకుంటావా?

అయితే, ఉమా శంకర్ కు మద్యం సేవించే అలవాటు ఉండటం, చేస్తున్న టైల్స్ వృత్తి(Tiles profession)లో స్థిరపడక పోవటంతో కూతురిని ఇచ్చి వివాహం చేయటానికి వాళ్లు అంగీకరించ లేదు. కాగా, సోమవారం మధ్యాహ్నం మరోసారి ఇంటికి వచ్చిన ఉమా శంకర్ కూతురునిచ్చి పెళ్లి చేస్తారా? లేదా? అని లక్ష్మీ, కాంతారావులను అడిగాడు. పెళ్లి చేసేది లేదని వాళ్లు చెప్పటంతో నన్ను వివాహం చేసుకుంటావా? అని పవిత్రను అడిగాడు. దానికి ఆమె కూడా నిరారించింది. దాంతో వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రపై దాడి చేసిన ఉమా శంకర్ ఆమె గొంతును కోసివేశాడు. దాంతో రక్తం మడుగులో కుప్పకూలిపోయిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న ఉమా శంకర్ కోసం గాలిస్తున్నారు.

Also Read: JiohotStar: టీ20 వరల్డ్ కప్‌కు ముందు అనూహ్య పరిణామం.. ఐసీసీ మీడియా రైట్స్ నుంచి జియోస్టార్ నిష్క్రమణ?

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?