Vennam Srikanth Reddy: కంబాలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చీరిక వసంత ఉపేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి (Vennam Srikanth Reddy:) సూచించారు. కంబాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చీరిక వసంత ఉపేందర్ రెడ్డి తరపున జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచిగా గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు.
Also Read: Vennam Srikanth Reddy: సన్నబియ్యం పంపిణీ షురూ.. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
ఓ ప్రతినిధి ఉంటేనే ప్రభుత్వం
సీఎం రేవంత్ రెడ్డి తన శాయ శక్తుల రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. గ్రామం నుంచి అభివృద్ధి కోసం ఓ ప్రతినిధి ఉంటేనే ప్రభుత్వం వద్దకు వెళ్లి అభివృద్ధి నిధులను తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత ఉపేందర్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వివరించారు.
Also Read: Kisan Yatra: రైతుల కోసం సరికొత్త యాత్ర.. ఊరూరా స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?

