Viral Video: ధూమ్ మూవీ స్టైల్లో దోపిడి.. ఎలా దోచేశారో చూడండి!
Viral Video (Image Source: Twitter)
Viral News

Viral Video: ధూమ్ మూవీ స్టైల్లో దోపిడి.. బైక్ నుంచి రన్నింగ్ బస్ ఎక్కి.. ఎలా దోచేశారో చూడండి!

Viral Video: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా (Beed district)లో కొందరు దొంగలు సినీ ఫక్కీలో దోపిడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోలాపూర్ – ధూలే హైవే (Solapur-Dhule highway)పై ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుంచి దొంగలు సాహాసోపేతంగా కొన్ని లగేజీలను దోచేశారు. బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలోనే డ్రైవర్ కు ఏ మాత్రం అనుమానం రాకుండా పనిని చక్కబెట్టేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

2025 అక్టోబర్ లో ఈ ఘటన జరగ్గా.. తాజాగా అందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. పెళ్లికి వెళ్తున్న బస్సును కొందరు దొంగలు టార్గెట్ చేశారు. బస్సుకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే.. రెండు బైకులపై ఐదుగురు దుండగలు బస్సును ఫాలో అయ్యారు. ఈ క్రమంలో ఓ దొంగ బైక్ మీద నుంచి బస్సు మీదకు ఎక్కాడు. లగేజీ క్యాబిన్ డోర్ ను తెరిచి.. అందులోని బ్యాగులు, సంచులను రోడ్డు మీదకు విసిరేశాడు. అనంతరం రన్నింగ్ లోనే బస్ దిగి.. అక్కడి నుంచి దొంగలు ఉడాయించారు. వెంట వచ్చిన దొంగలు రోడ్డుపై పడిన బ్యాగులను తీసుకొని పరారయ్యారు. మెుత్తంగా బస్సులోని 10 సంచులను వారు దోచేసినట్లు సమాచారం.

హైవేపై గస్తీ ఏర్పాటు

రన్నింగ్ బస్సు నుంచి లగేజీలను దోచేయడాన్ని బీడ్ జిల్లా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. జాతీయ రహదారిపై గస్తీని బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ నవనీత్ కన్వాట్ మాట్లాడుతూ.. దొంగలను గుర్తించి పట్టుకోవడం కోసం హైవే పహారా, పర్యవేక్షణను పెంచినట్లు తెలిపారు. కాగా ఇటీవల కాలంలో నిలిపి ఉంచిన వాహనాలు, నెమ్మదిగా ప్రయాణిస్తున్న ట్రావెల్ బస్సులపై దారి దోపిడి ఘటనలు పెరిగిపోయాయి.

Also Read: CM Revanth – Global Summit: కోర్, ప్యూర్, రేర్ స్ట్రాటజీతో.. తెలంగాణ రైజింగ్ సాధిస్తాం.. సీఎం పవర్ ఫుల్ స్పీచ్

ప్రయాణికులు, డ్రైవర్లకు అలర్ట్..

అయితే ప్రైవేటు వాహనాలల్లో ప్రయాణించే వారు చాలా అప్రమత్తంగా ఉండాలని బిడ్ జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలకు వెలుపల ఉండే లగేజీ క్యాబిన్స్ లో వస్తువులు పెట్టవద్దని సూచిస్తున్నారు. డ్రైవర్లు ఎలాంటి అనుమానస్పద కదలికలను గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే హైవేపై ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, తినుబండారాల దుకాణాదారులు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సీసీటీవీ ఉంటే అది సక్రమంగా పనిచేస్తుందో? లేదో? చెక్ చేసుకోవాలని ఆదేశించారు.

Also Read: Telangana Rising Global Summit 2025: పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్.. దేశంలోనే మోడరన్ స్టేట్.. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రముఖులు

Just In

01

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!