Telangana Rising Global Summit 2025: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది. సమ్మిట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) హాజరయ్యారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivkumar), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ రంగాలకు చెందిన దేశ, విదేశాల ప్రముఖులు సమ్మిట్ లో పాల్గొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పీచ్..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. ‘రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక ప్రగతిని మార్చే ప్రముఖులు ఈ ఈవెంట్ కి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతి కొనసాగుతోంది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పడుతోంది. తెలంగాణ మోడరన్ స్టేట్ గా ఎదుగుతుంది. ఉమెన్ ఎంటర్ ప్రన్యూర్లకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2047లో 3 ట్రిలియన్ ఎకనామీగా తెలంగాణ అవతరిస్తుంది’ అని గవర్నర్ చెప్పుకొచ్చారు.
కైలాష్ సత్యార్తి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి.. గ్లోబల్ సమ్మిట్ కు హాజరై మాట్లాడారు. ’20 లక్షల రైతుల రుణాలు సీఎం రేవంత్ రెడ్డి మాఫీ చేశారు. ఎకానమీ తో పాటు హెల్తీ తెలంగాణ గా రాష్ట్రం మారాలి. 2034 లో వరకు 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తెలంగాణ కు సాధ్యమే. గ్లోబల్ సమ్మిట్ లో మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం అభినందనీయం. ఇక్కడున్న వివిధ రంగాల ప్రముఖులే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతారు. ఇండియాలో 100 సమస్యలు ఉండొచ్చు.. కానీ ప్రతీ సమస్యను పరిష్కరించుకునే వారు ఉన్నారు. ఇది ఇన్వెస్టర్స్ సమ్మిట్ మాత్రమే కాదు. ఇండియా లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే… బిజినెస్ మాత్రమే కాదు.. భారత దేశ శాంతి సామరస్యాలతో కొనసాగుతారు’ అని అన్నారు.
Also Read: Rithu Chowdary: షాకింగ్ స్టేట్మెంట్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచిన రీతూ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి
తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. గ్లోబల్ సమ్మిట్ లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలన పూర్తి చేసుకుంది. 2047 కి 3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి గ్లోబల్ సమ్మిట్ మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ఇన్నోవేషన్ లో తెలంగాణ ముందుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ ముందుంది. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్ కమ్ రూ. 3.7 లక్షలుగా ఉంది. మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ లో తెలంగాణ ముందుంది. టెక్నాలజీ, వెదర్, హ్యూమన్ పవర్ పరంగా తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి బెస్ట్ ప్లేస్. ఫ్యూచర్ సిటీ లో AI యూనివర్సిటీ రాబోతుంది. విజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పొలిటికల్ స్టెబిలిటీతో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. పెట్టుబడులు పెట్టేవారికి తెలంగాణ వెల్కమ్ చెబుతుంది’ అని పేర్కొన్నారు.

