Euro 2024 France Register Narrow Win Over Belgium To Reach Quarter finals
స్పోర్ట్స్

Euro 2024: క్వార్టర్ ఫైనల్‌కి ఎంట్రీ 

Euro 2024 France Register Narrow Win Over Belgium To Reach Quarter finals: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఫ్రాన్స్ క్వార్టర్స్‌కి చేరుకుంది. గత అర్థరాత్రి ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0 తేడాతో బెల్జియంపై గెలుపొందింది. బెల్జియం డిఫెండర్ జాన్ వెర్టోంఘెన్ చేసిన ఘోర తప్పిదం ఫ్రాన్స్‌కు ప్లస్‌ అయింది. మరో 5 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా జాన వెర్టోంఘెన్ సెల్ఫ్ గోల్ చేశాడు.

ఫ్రాన్స్ ప్లేయర్ రాండల్ కోలో మువానిని సైడ్ చేసే క్రమంలో జాన్‌ వెర్టోంఘన్ బంతిని తమ గోల్‌ పోస్ట్‌లోకి పంపించాడు. దాంతో ఫ్రాన్స్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బెల్జియం ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆటను 3 నిమిషాలకు పొడిగించినా ఫలితం మారలేదు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, పోర్చుగల్ వర్సెస్ స్లోవెనియా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడనుంది. ఇంగ్లండ్, స్పెయిన్‌లు కూడా క్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. చివరి నిమిషాల్లో గోల్స్‌ సాధించిన ఇంగ్లండ్ తృటిలో ఓటమి నుంచి గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో స్లోవేకియాపై విజయం సాధించి అందరికి షాక్ ఇచ్చింది.

Also Read: సస్పెన్షన్‌పై రోహిత్‌ శర్మ క్లారిటీ

బెల్లింగ్ హమ్, హ్యారీ కేన్ గోల్స్ సాధించి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు.స్లోవేకియా తరఫున షురాంజ్ ఏకైక గోల్ నమోదు చేశాడు. నిర్ణీత సమయంలో ఇంగ్లండ్ 0-1తో వెనుకంజలో నిలిచింది. స్టాపేజ్ సమయంలో బెల్లింగ్‌హమ్ తలతో అద్భుతంగా గోల్ చేసి ముందంజలో ఇంగ్లండ్‌ను నిలబెట్టాడు. గోల్స్ సమం కావడంతో రిజల్ట్స్ రివీల్ చేసేందుకు ఎక్స్‌ట్రా టైమ్‌ని కేటాయించగా.. స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ గోల్ చేసి జట్టు విజయాన్ని కంప్లీట్ చేశాడు. రోహిత్ ఫ్లేస్‌లో మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో స్పెయిన్ 4-1తో జార్జియాను ఓడించింది. రోడ్రి, ఫాబియన్, విలియమ్స్, ఒల్మో స్పెయిన్ తరఫున చెరో గోల్ నమోదు చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!