Vande Mataram Debate: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 10 గంటల సమయాన్ని కేటాయించారు. వందేమాతరం ఔన్నత్యం, విశిష్టత గురించి అధికార, విపక్ష పార్టీల నేతలు మాట్లాడనున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంతో ఈ ప్రత్యేక చర్చను ప్రారంభించారు. వందేమాతరం ఒక మంత్రం, ఒక నినాదం అంటూ మోదీ ప్రారంభోత్సవ ప్రసంగంలో మాట్లాడారు.
ఇది చారిత్రాత్మక క్షణం
వందేమాతర గీతం.. దేశ స్వాతంత్ర ఉద్యమానికి శక్తిని, ప్రేరణను అందించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. త్యాగం, సాధనకు మార్గాన్ని చూపిందని కొనియాడారు. ‘వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భానికి మనమంతా సాక్షులుగా ఉండటం గర్వకారణం. ఇది చారిత్రాత్మక క్షణం. అనేక చారిత్రాత్మక సంఘటనలను కీలక మైలురాళ్లుగా మనం గత కొంతకాలంగా జరుపుకుంటున్నాం. ఇటీవలే మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ఉత్సవాలు నిర్వహించాం. దేశం సర్దార్ పటేల్, బిర్సా ముండా వారి 150వ జయంతులను జరుపుకుంటోంది. గురు తేజ్ బహాదూర్ జీ వారి 350వ జన్మదినం ఇటీవల జరుపుకున్నాం. ఇప్పుడు మనం వందే మాతరం 150 ఏళ్లను జరుపుకుంటున్నాం’ అని మోదీ అన్నారు.
#WATCH | PM Narendra Modi says, "Vande Mataram was not just a mantra for political independence. It was not limited to our independence; it was way beyond that. The freedom movement was a war to free our motherland from the clutches of slavery… During our Vedas, it was said,… pic.twitter.com/UAAED5YLEM
— ANI (@ANI) December 8, 2025
స్వాతంత్రానికి ఈ గీతమే ప్రేణ
వందేమాతరం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సమయానికి భారత దేశం బ్రిటిష్ పాలనలో ఉండేదని ప్రధాని మోదీ గుర్తుచేశారు. వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి భారత్ ఎమర్జెన్సీ అనే సంక్షోభంలో చిక్కుకుని ఉందని పేర్కొన్నారు. ‘ఆ సమయంలో దేశ భక్తులు జైళ్లల్లో బంధించబడ్డారు. మన స్వాతంత్ర పోరాటానికి ప్రేరణనిచ్చిన ఆ గీతం శతాబ్దం పూర్తి చేసుకున్నప్పుడు దురదృష్టవశాత్తు భారత్ చీకటి రోజులను ఎదుర్కొంది. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తిరిగి గుర్తుచేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. 1947లో స్వాతంత్ర సాధించడానికి ఈ గీతమే మనకు ప్రేరణ ఇచ్చింది’ అని మోదీ చెప్పుకొచ్చారు.
Also Read: Austrian Woman: మంచు పర్వతంపై లవర్‌ను వదిలేసిన ప్రియుడు.. చివరికి ఏమైందంటే?
‘వందేమాతరం రుణం తీర్చుకుందాం’
వందేమాతరానికి నాయకత్వం, ప్రతిపక్షం అనే తారతమ్యాలు లేవని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘వందేమాతరం పట్ల మనందరం కలిసికట్టుగా కృతజ్ఞత తెలిపేందుకు మనం ఇక్కడ ఉన్నాం. ఈ గీతమే మనందరినీ ఇక్కడకు తీసుకువచ్చింది. వందే మాతరం పట్ల రుణం తీర్చుకునే పవిత్రమైన సందర్భం ఇది. ఈ గీతం ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర వరకు దేశాన్ని ఏకం చేసింది. మళ్ళీ మనం ఏకమై కలిసి ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఈ గీతం మనకు ప్రేరణ, శక్తిని ఇచ్చింది. మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చేందుకు మనం కృషి చేయాలి. 2047 నాటికి దేశాన్ని ఆత్మనిర్భరంగా, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటించాలి’ అని మోదీ తన ప్రారంభ స్పీచ్ ను ముగించారు.

