Actor Dileep: నటిపై లైంగిక దాడి కేసు.. హీరోను నిర్దోషిగా తేల్చిన కోర్టు
Actor Dileep (Image Source: Twitter)
జాతీయం

Actor Dileep: నటిపై లైంగిక దాడి కేసు.. స్టార్ హీరోను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

Actor Dileep: కేరళలో సంచలనం సృష్టించిన నటిపై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు వెలువడింది. 2017 నాటి కేసులో మలయాళ నటుడు దిలీప్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి గత 8 ఏళ్లుగా దిలీప్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎర్నాకులం డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు (Ernakulam District and Principal Sessions Court)లో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేసులో 8వ నిందితుడిగా ఉన్న దిలీప్ ను నిర్దోషి (Not Guilty)గా కోర్టు తేల్చింది. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించినట్లు నటుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ.. సరైన సాక్ష్యాధారాలు లేనందున వాటిని కోర్టు తోసిపుచ్చింది.

నటిపై లైంగిక దాడి కేసుకు సంబంధించి మెుత్తం 10 మందిపై కేరళ పోలీసులు కేసులు నమోదు చేశారు. పల్సర్ సునీ, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజేష్, సలీం, ప్రదీప్ (నటుడు), చార్లీ థామస్, సనీల్, శరత్ లపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కిడ్నాప్, మహిళపై దాడి, దుస్తులు ధరించకుండా బలప్రయోగం చేయడం, సామూహిక అత్యాచారయత్నం, అసభ్యకర ప్రవర్తన వంటి అభియోగాలను దర్యాప్తు అధికారులు మోపారు.

Also Read: TG Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో జరిగే నేటి కార్యక్రమాలు ఇవే..!

కేసు విషయానికి వస్తే 2017 ఫిబ్రవరి 17వ తేదీన మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటిని కారులో అపరించుకొని వెళ్లి, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 గంటల పాటు కారులో నిర్భందించి అసభ్యకరంగా నిందితులు ప్రవర్తించినట్లు నటి ఆరోపణలు చేశారు. వారి వెనుక నటుడు దిలీప్ ఉన్నట్లు ఆమె బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు.. తొలి చార్జిషీట్ ను
2017 ఏప్రిల్ లో దాఖలు చేశారు. నటుడు దిలీప్ ను అదే ఏడాది జులైలో అరెస్ట్ చేశారు. తర్వాత 2017 అక్టోబర్ లో అతడికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు నిందితులు అప్రూవర్లుగా మారి, బెయిల్ పొంది జైలు నుంచి కూడా విడుదలదయ్యారు.

Also Read: Telangana Rising Summit: 6000 పోలీసులు.. 1000 సీసీ కెమెరాలు.. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు భారీ భద్రత

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం