Minister Ponguleti: నోరుంది కదా అని తప్పుడు ప్రచారం చేయొద్దు
Minister Ponguleti (imagecredit:twitter)
Political News, Telangana News

Minister Ponguleti: నోరుంది కదా అని తప్పుడు ప్రచారం చేయొద్దు: మంత్రి పొంగులేటి వార్నింగ్

Minister Ponguleti: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రిసెడెంట్ కేటీఆర్‌(KTR)కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిల్ట్ పాలసీ(Hilt Policy) కింద వేలంలో కొన్న భూములను వెనెక్కి తీసుకుంటామని, భూముల కన్వెర్షన్ రద్దు చేస్తామంటున్నారని, మరీ బీఆర్ఎస్ హయాంలో ఈ రెండు పాలసీలను పదేళ్లుగా అమలు చేశారని పొంగులేటి గుర్తు చేశారు. రూ.101కోట్లకు అమ్మిన నియోపోలీస్ భూమి సహా వేల ఎకరాల భూములను కేటీఆర్ హయాంలో అమ్మకం సాగించారని, ఓఆర్ఆర్(ORR) కూడా అమ్మారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఇప్పుడు తాము వాటిని ఎక్కడా వెనక్కి తెస్తామని చెప్పలేదన్నారు.

Also Read: Akhanda 2: ‘అఖండ 2’కు రిలీజ్‌ కష్టాలు.. అడ్డంగా బుక్కయిన వేణు స్వామి

మీ సంగతి తెలియదా..

మీ హయాంలో చేసినవన్నీ మేము వెనక్కి తీసుకుంటున్నామా అని ప్రశ్నించారు. కేటీఆర్(KTR) నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని, తమ ప్రభుత్వం మీలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించబోదని పేర్కొన్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో జరిగిన ఎల్బీనగర్‌లో సిరీస్ కంపెనీ భూములు కన్వెర్షన్ చేసింది ఎవరని పొంగులేటి ప్రశ్నించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములను రెసిడెన్షియల్ జోన్‌గా కన్వర్షన్ చేశారని గుర్తు చేశారు. అలా ఐడీపీఎల్ సహా పలుచోట్ల ఉన్న ఆనాటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, బినామీల కంపెనీల భూములను కన్వెర్షన్ చేసిన సంగతి తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా కన్వెర్షన్ చేసిన ప్రతి గజం వివరాలు బయటపెడతామని మంత్రి పొంగులేటి అన్నారు. మీలా ఇష్టం వచ్చినట్లుగా తాము చేయలేమన్నారు. నోరుంది కదా అని మాటిమాటికి రూ. 5లక్షల కోట్ల స్కామ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తే చూస్తు ఊరుకునే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు.

Also Read: Haiku Movie: ‘కోర్టు’ మూవీ ఫేం శ్రీదేవి అపల్ల ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదలైంది చూశారా?

Just In

01

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం

Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!