Dharma Mahesh: ‘సింధూరం’ (Sindhooram), ‘డ్రింకర్ సాయి’ (Drinker Sai) చిత్రాల హీరో ధర్మ మహేష్ (Dharma Mahesh) దూసుకెళుతున్నాడు. సినిమా పరంగా కాదండోయ్.. బిజినెస్ (Dharma Mahesh Business) పరంగా ఆయన నూతనంగా స్టార్ట్ చేసిన ‘జిస్మత్ మండి’ (Jismat Mandi)ని విస్తరిస్తూ వార్తలలో నిలుస్తున్నారు. రీసెంట్‌గా అమీర్ పేట్‌లో ఓ బ్రాంచిని మొదలు పెట్టిన ధర్మ మహేష్.. తాజాగా తమ రెండవ బ్రాండ్‌ని చైతన్యపురిలో ప్రారంభించారు. తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో ‘గిస్మత్ మండీ’ని.. ‘జిస్మత్ మండీ’గా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ముఖ్యంగా భోజన ప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను ‘జిస్మత్ మండి’తో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. తన కుమారుడి పుట్టినరోజున అమీర్ పేట్‌లో బ్రాంచ్‌ని ఓపెన్ చేసిన మహేష్.. భోజన ప్రియులకు మొదటి ఆప్షన్‌గా ఈ మండీ ఉండేలా.. మెనూలో ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తామని తెలిపారు. చికెన్, మటన్, చేపలు, పన్నీర్.. ఇలా అన్ని రకాల శాఖాహార, మాంసాహారాలతో, మంచి రుచితో భోజన ప్రియులను మెప్పించడమే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు.
Also Read- Actress Pragathi: నవ్వుకున్న వాళ్లందరికీ ఇదే ప్రగతి ఆన్సర్.. ఇండియా తరపున టర్కీ ఏషియన్ గేమ్స్‌కు!
నా కుమారుడికి అంకితం
ఇంకా ధర్మ మహేష్ మాట్లాడుతూ.. ఈ రీబ్రాండింగ్ ‘Gismat’ నుంచి ‘Jismat’కు మార్చడం జరిగింది. ఇది నాణ్యత, ఎమోషన్, వారసత్వం వంటి ప్రేరణతో కొత్త దశను సూచిస్తుందని తెలిపారు. భావోద్వేగపరంగా, ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుంది. ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌ను బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను. ఈ బ్రాండ్‌ను నా కుమారుడికి అంకితం ఇస్తూ, ముందు ముందు మరిన్ని బ్రాంచ్‌లతో, మరింత మందికి చేరువ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల చిరునవ్వు, ఆహ్లాదానికి ప్రతీకలుగా ఉండాలని, ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన, రుచికరమైన వంటలను ప్రజలకు అందించేందుకు అందుబాటులోకి వస్తున్నదే ఈ జిస్మత్ మండి అని చెప్పుకొచ్చారు.
ధ్యాసంతా అదే..
ఈ క్రమంలో ఆయన తన తదుపరి సినిమాల విషయంలో మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన ధ్యాసంతా ‘జిస్మత్ మండీ’పైనే పెట్టినట్లుగా తెలిపారు. ఇటీవల ఆయన ‘డ్రింకర్ సాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన సక్సెస్ సాధించకపోయినప్పటికీ, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను మాత్రం అందుకుంది. మరీ ముఖ్యంగా ఇందులోని ధర్మ మహేష్ నటనను విశ్లేషకులు కూడా మెచ్చుకున్నారు. డిసెంబర్ 2024లో ఈ చిత్రం విడుదలైంది. ధర్మ మహేష్ సరసన ఐశ్వర్య శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

