Fake ST Certificates: పాల్వంచ(Palvancha) మండలం, దంతలబోర ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నకిలీ ఎస్టీ కుల ధ్రువపత్రాలతో నామినేషన్లు వేశారని ఆరోపణ సంచలనంగా మారింది. మాజీ సర్పంచ్ గద్దెల రమేష్(Gaddela Ramesh) ఆధ్వర్యంలో గ్రామస్తుల నిరసన వ్యక్తం చేశారు0. అసలైన ఎస్టీ కుటుంబానికి అన్యాయం జరిగిందని వారు ఆరోపణ వ్వక్తం చేశారు. దంతాలబోర(dhanthala bora) గ్రామంలో మొత్తం 609 మంది ఓటర్లు ఉన్నారని, వారంతా ఎస్సీ(SC) కుటుంబాలకు చెందినవారని వెల్లడివంచారు. కేవలం ఒక్క ఎస్టీ కుటుంబం మాత్రమే అక్కడ ఉందని స్పష్టం చేస్తున్నారు. వలస వచ్చిన అభ్యర్థులు ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) నుంచి వలస వచ్చిన కొందరు బీసీ(హఢ) అభ్యర్థులు తమను ఎస్టీ(ST)లుగా చెప్పుకుంటూ నామినేషన్లు వేశారని ఆరోపిస్తున్నారు.
గెజిటెడ్ సంతకాలతో ధ్రువపత్రం
ఎమ్మార్వో(MRO) సర్టిఫికెట్ లేకుండానే, లెక్చరర్, డాక్టర్ సంతకాలతో కూడిన నకిలీ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ (R.O.) ఆమోదించారని ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన అభ్యర్థులపై, సంతకాలు చేసిన గెజిటెడ్ అధికారులపై, మరియు ఆమోదించిన ఆర్.ఓ.పై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి వాల్లు కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. నకిలీ అభ్యర్థులు నామినేషన్లు వెంటనే ఉపసంహరించుకోకపోతే, గ్రామంలో పంచాయతీ ఎన్నికలను మొత్తం బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
Also Read: PDS Rice Scam: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం.. లారీ సీజ్..!

