Nalgonda District: తమ తెలియకుండా తమ భూమిలో కొంత ఇతరులకు రిజిస్ట్రేషన్(Registration) చేసిన విషయమై సమాచార హక్కు చట్టం(RTI) కింద ప్రొసీడింగ్స్, ఇతర వివరాలను రికార్డుల రూపంలో ఇచ్చేందుకు రైతు నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసి అందులో రూ. 20 వేలు తీసుకుంటూ నల్గొండ(Nalgonda) జిల్లా చండూరు(Chandur) మండల డిప్యూటీ ఎమ్మార్వో చంద్రశేఖర్(Chandrasekhar) గురువారం రాత్రి హైదరాబాద్(Hyderabad) బాలానగర్ చౌరస్తాలో ఏసీబీ(ACB)కి చిక్కారు. స్థానికులు, బాధితుడు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సమాచార హక్కు చట్టం
గట్టుప్పల్ కు చెందిన ఉస్మాన్ షరీఫ్(Usman Sharif) వ్యవసాయ భూమిలో కొంత ల్యాండ్ ఇతరులపై రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాగ వివరాలను చెప్పేందుకు అధికారులు తిరస్కరించడంతో బాధితుడు సమాచార హక్కు చట్టం కింద రికార్డులను ఇవ్వాలని కోరారు. అయితే భూమి మార్పిడి పై ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు లంచం సొమ్ములో రూ. 20 వేలు తీసుకుంటుండగా వలవేసిన ఏసీబీ(ACB) అధికారులు డీటీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరు పరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

