New Delhi: భారత్ - రష్యా మధ్య కీలక ఒప్పందాలు
New Delhi (Image Source: Twitter)
జాతీయం

New Delhi: భారత్ – రష్యా మధ్య కీలక ఒప్పందాలు.. ప్రకటించిన ఇరు దేశాధినేతలు

New Delhi: భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఇరుదేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్యం, రక్షణరంగం, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌, వలస విధానం సహా పలు అంశాలపై చర్చించి ఇరు దేశాధినేతలు ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం ఇరుదేధినేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. వారి సమక్షంలో వివిధ ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఆయా దేశాల అధికారులు మార్చుకున్నారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ – రష్యా స్నేహం శాశ్వతమైనదని పేర్కొన్నారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. భారత వాణిజ్యానికి రష్యా అండగా ఉంటోందని చెప్పారు. యూరియా ఉత్పత్తికి సాయం చేసేందుకు రష్యా ముందుకొచ్చిందని మోదీ తెలిపారు. భారత్ – రష్యా ఆర్థిక ప్రణాళికపై 2030 వరకూ ఒప్పందాలు కుదిరియాని ప్రధాని స్పష్టం చేశాయి. ఈ భేటి ఇరుదేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలకు మరో మైలురాయిగా నిలిచిపోతుందని మోదీ అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదంపై జరిగే పోరులో భారత్ – రష్యాలు కలిసికట్టుగా నడుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో కలిసి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘గత 8 దశాబ్దాలుగా ప్రపంచం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. మానవత్వం అనేక సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొంది. వీటన్నిటి మధ్య కూడా భారత్ – రష్యా స్నేహం ఒక ధ్రువతార వలే స్థిరంగా కొనసాగింది. బలమైన గౌరవం, లోతైన నమ్మకంతో పాతుకుపోయిన ఈ బంధం కాలానికే పరీక్షగా నిలిచింది’ అని ప్రధాని పేర్కొన్నారు.

మరోవైపు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ప్రధాని మోదీ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తొలి నుంచి శాంతినే సమర్థించిందని మోదీ అన్నారు. శాంతి యుత ధోరణిలో శాశ్వత పరిష్కారానికి జరుగుతున్న అన్ని ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. శాంతి స్థాపనలో తన వంతు సహకారాన్ని అందించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు.

మరోసారి ఉగ్రవాదం గురించి ప్రస్తావించిన మోదీ.. టెర్రరిజంపై జరిగే పోరులో చాలా కాలం నుంచి భారత్ – రష్యాలు భుజం భుజం కలిపి నిలబడి ఉన్నాయని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అయినా, క్రోకస్ సిటీ హాల్ పై జరిగిన పిరికి పంద దాడి అయినా వీటన్నింటికి మూలం ఉగ్రవాదమేనని మోదీ పేర్కొన్నారు. మానవత్వంపై జరిగే ప్రత్యక్షదాడిగా దానిని అభివర్ణించారు. రాబోయే కాలంలో ఎదురయ్యే ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ – రష్యా స్నేహం బలాన్ని ఇస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల ఉమ్మడి భవిష్యత్ ను సుసంపన్నం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Also Read: Live-in Relationship: పెళ్లి వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కాగా గతంలో భారత్ పై జరిగిన ఉగ్రదాడులను రష్యా ఖండించింది. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించింది. పాక్ ముష్కర మూకపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు రష్యా తన మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదులపై భారత్ జరిపే పోరులు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాధినేతలు అధికారికంగా ఉగ్రవాదంపై ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మరోవైపు రష్యా నుంచి కొనుగోలు ఎస్ – 400 క్షిపణి నిరోధక వ్యవస్థ ఆపరేషన్ సిందూర్ సమయంలో మెరుగైన పనితీరును కనబరచడం తెలిసిందే.

Also Read: Mega Parents-Teachers Meeting: స్కూళ్లకు వెళ్లిన చంద్రబాబు, పవన్.. విద్యార్థులతో మాటామంతి.. ఆపై కీలక వ్యాఖ్యలు

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం