RBI BSBD 2026 New Rules: జీరో బ్యాలెన్స్ ఖాతాలపై కొత్త రూల్స్
RBI BSBD 2026 New Rules (Image Source: Twitter)
బిజినెస్

RBI BSBD 2026 New Rules: జీరో బ్యాలెన్స్ ఖాతాలపై కొత్త రూల్స్.. ఫ్రీగా మరికొన్ని సేవలు.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

RBI BSBD 2026 New Rules: బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్‌ (BSBD) ఖాతాల నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏడు కొత్త సవరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వర్తించేలా వీటిని ముందుకు తీసుకొచ్చింది. 2025 అక్టోబర్ 1న విడుదలైన బీఎస్‌బీడీ (BSBD) ఖాతాల ముసాయిదా మార్గదర్శకాలపై వచ్చిన ప్రజా అభిప్రాయాలను, అమల్లో ఉన్న నిబంధనలను పూర్తి స్థాయిలో సమీక్షించి.. కొత్త మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేయడం గమనార్హం. ఇంతకీ బీఎస్ బీడీ ఖాతా అంటే ఏంటీ? ఆర్బీఐ జారీ చేసిన ఏడు కొత్త మార్గదర్శకాలు ఏవి? తదితర అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

బీఎస్‌బీడీ ఖాతా అంటే ఏమిటి?

బీఎస్ బీడీ ఖాతాను జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని కూడా అంటారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాథమిక పొదుపు ఖాతా. ఇతర ఖాతాల తరహాలో వీటిలో కనీస బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధన ఉండదు. ఉచితంగానే ప్రాథమిక బ్యాకింగ్ సేవలను బీఎస్ బీడీ ఖాతాలు అందిస్తుంటాయి. అయితే డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ ఖాతాకు విధించిన నిబంధనల్లో ఆర్బీఐ కొన్ని సవరణలు చేసింది. ఇందుకు సంబంధించి ఏడు మార్గదర్శకాలను దేశంలోని బ్యాంకులకు జారీ చేసింది.

మార్పుల వెనుక కారణం ఏంటీ?

బీఎస్‌బీడీ ఖాతాల నిబంధనల్లో ఆర్బీఐ మార్పులు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ (Responsible Business Conduct) రూపకల్పనలో భాగంగా BSBD ఖాతాల వినియోగాన్ని పెంచడం, ఖర్చు భారాన్ని తగ్గించడం, ఖాతాదారుల సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా ఏడు కొత్త సవరణ మార్గదర్శకాలను ఆర్బీఐ రూపొందించింది. దేశంలోని కమర్షియల్ బ్యాంకులు (Commercial banks), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (Small finance banks), పేమెంట్స్ బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన 7 సవరణ మార్గదర్శకాలు వర్తించనున్నాయి.

ఏడు కొత్త సవరణ మార్గదర్శకాలు

దేశంలోని ప్రతీ బ్యాంకు బీఎస్ బీడీ ఖాతాను ఒక ప్రామాణిక సేవింగ్స్ ఖాతాలా అందించాలని ఆర్బీఐ మరోమారు స్పష్టం చేసింది. దీంతో పాటు ఆ ఖాతాకు సంబంధించి ఏడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి ఏంటంటే..

1. కనీస బ్యాలెన్స్ అవసరం లేదు

2. ఏ చానల్‌ ద్వారా అయినా అమితమైన డిపాజిట్లు

3. వార్షిక ఛార్జీలు లేకుండా ఉచిత ఏటీఎం లేదా ఏటీఎం-కమ్-డెబిట్ కార్డ్

4. ఏడాదికి కనీసం 25 పేజీల చెక్‌బుక్

5. ఇంటర్నెట్ అండ్ మొబైల్ బ్యాంకింగ్

6. ఉచిత పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్

7. నెలకు కనీసం నాలుగు ఉచిత విత్‌డ్రాయల్స్ (ఏటీఎం, నగదు ట్రాన్స్‌ఫర్‌లు కలిపి)

గమనిక: అయితే యూపీఐ (UPI), నెఫ్ట్ (NEFT), RTGS, IMPS, PoS డిజిటల్ లావాదేవీలు ఈ నాలుగు విత్‌డ్రాయల్ పరిమితిలోకి రావు. అదే విధంగా బ్యాంకులు ATM కార్డు, చెక్‌బుక్, డిజిటల్ సేవలను బలవంతంగా ఇవ్వకూడదు. వినియోగదారుడు కోరినప్పుడే ఇవ్వాలని ఆర్బీఐ తాజాగా సూచించింది. బీఎస్‌బీడీ ఖాతా దారుడికి అదనపు సేవలు ఇవ్వాలంటే పారదర్శకతతో వివక్ష లేకుండా ఇవ్వాలని, కనీస బ్యాలెన్స్ షరతులు విధించరాదని స్పష్టం చేసింది.

Also Read: 2026 Eclipses: వచ్చే ఏడాది గ్రహణ తేదీలు ఇవే.. తొలి సూర్య గ్రహణం ఎప్పుడంటే?

బీఎస్‌బీడీ ఖాతా పరిమితులు

మరోవైపు బీఎస్ బీడీ ఖాతాలు తెరవడం, నిర్వహించడం KYC/AML నిబంధనలకు లోబడి ఉండనుంది. ముందుగా నిర్దేశించిన విధంగానే మైనర్లు కోసం ప్రత్యేక నియమాలు అమల్లో ఉంటాయి. వినియోగదారులు తమ ప్రస్తుత సేవింగ్స్ ఖాతాలను BSBD ఖాతాలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. బ్యాంకులు ఈ ప్రక్రియను 7 రోజులలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి దేశంలోని ఏ బ్యాంకులోనైనా ఒక్క BSBD ఖాతాను మాత్రమే కలిగి ఉండాలి. దీని కోసం బ్యాంకులు ఖాతాదారుడి నుంచి డిక్లరేషన్ తీసుకుంటాయి. అంతేకాదు బీఎస్ బీడీ ఖాతాకు సంబంధించిన స్వభావం గురించి ఖాతాను తెరిచిన సందర్భంలోనే ప్రజలకు తెలియజేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.

Also Read: Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తుడి తలపగలగొట్టిన వ్యాపారి

Just In

01

Gold Rates: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!