Cyber Criminals: : సైబర్ క్రిమినల్స్ బస్తీమే సవాల్ అంటున్నారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారన్న కోపమో? మనల్ని పట్టుకునేది ఎవరన్న ధీమానో? న్యాయస్థానాలు, ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లను టార్గెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల వెబ్‌సైట్లను టార్గెట్ చేశారు. వీటిలోకి లాగిన్ అయితే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు రీ డైరెక్ట్ అయ్యేలా చేశారు.
Also Read: Cyber Criminals: కేటుగాళ్ల భరతం పడుతున్న పోలీసులు.. 59 మంది అరెస్ట్.. ఎన్ని లక్షలు రికవరీ చేసారంటే?
ఐటీ బృందాలు రంగంలోకి
దీంతో గత నెల 15వ తేదీ నుంచి ఈ రెండు వెబ్‌సైట్లు పని చేయకుండా పోయాయి. దాంతో అప్రమత్తమైన రెండు కమిషనరెట్ల ఐటీ బృందాలు రంగంలోకి దిగాయి. మాల్వేర్‌ను ఈ సైట్లలోకి చొప్పించిన కేటుగాళ్లు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్లు, ఇతర సమాచారాన్ని హ్యాక్ చేసినట్టు తెలిసింది. కాగా, వెబ్‌సైట్ హ్యాక్ అయిన విషయం తెలియగానే సైబరాబాద్ ఐటీ బృందం గురువారం సాయంత్రానికి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని, ప్రజలు సైబరాబాద్ వెబ్‌సైట్ సేవలను వినియోగించుకోవచ్చని డీసీపీ సుధీంద్ర తెలిపారు.
Also Read: Cyber Criminals Arrested: పక్కా సెటప్‌తో సైబర్ మోసాలు.. 230 సిమ్ కార్డులు సీజ్!

