Realme Watch 5: స్టైలిష్ డిజైన్‌తో రియల్‌మీ వాచ్ 5 లాంచ్..
Realme ( Image Source: Twitter)
Technology News

Realme Watch 5: స్టైలిష్ డిజైన్‌తో రియల్‌మీ వాచ్ 5 లాంచ్.. ఫీచర్లు ఇవే..!

Realme Watch 5: రియల్‌మీ భారత్‌లో తన తాజా స్మార్ట్‌వాచ్ Realme Watch 5ను అధికారికంగా లాంచ్ చేసింది. పెద్ద AMOLED డిస్‌ప్లే, ఇండిపెండెంట్ GPS, అడ్వాన్స్‌డ్ హెల్త్ , ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లతో ఈ వాచ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వాచ్‌తో పాటు కంపెనీ కొత్తగా Realme P4x 5G స్మార్ట్‌ఫోన్‌ను కూడా AIoT లైనప్‌లో భాగంగా రిలీజ్ చేసింది. రియల్‌మీ తెలిపిన వివరాల ప్రకారం, Watch 5 భారతదేశంలోనే Optiemus Electronics తో తయారు చేస్తున్నారు. రాబోయే ఏడాదిలో అన్ని AIoT ఉత్పత్తుల మాన్యుఫాక్చరింగ్‌ను పూర్తిగా భారత్‌లోకి మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Realme Watch 5లో 1.97-అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. 390×450 రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, మాక్స్ 600 నిట్స్ బ్రైట్నెస్‌తో ఇది పర్ఫెక్ట్ విజువల్ అనుభూతిని ఇస్తుంది. 2D ఫ్లాట్ గ్లాస్ కవర్, మెటాలిక్ యూనిబాడీ, అల్యూమినియం అలాయ్ క్రౌన్, హనీకాంబ్ స్పీకర్ హోల్స్, కొత్త 3D-వేవ్ స్ట్రాప్‌తో వాచ్ డిజైన్ ప్రీమియం లుక్‌ ను కలిగి ఉంది.

Also Read: Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..

ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, NFC, 300కిపైగా కస్టమైజ్ చేయగలిగే వాచ్ ఫేస్‌లు లభిస్తాయి. GNSS సిస్టమ్స్‌తో కూడిన ఇండిపెండెంట్ GPS, 108 స్పోర్ట్స్ మోడ్‌లు, గైడెడ్ వర్కౌట్స్, స్ట్రెచింగ్ టూల్స్, Realme Link యాప్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఫిట్నెస్ అలవాటు ఉన్నవారికీ ఉపయోగకరంగా ఉంటాయి.

Also Read: Bhatti Vikramarka: ఇంటర్వ్యూలకు ఎంతమంది ఎంపికైనా ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధం : భట్టి విక్రమార్క

ధర ఎంతంటే? 

భారత మార్కెట్‌లో Realme Watch 5 ధరను రూ.4,499గా నిర్ణయించారు. అయితే, ప్రారంభ ఆఫర్‌లో రూ.500 డిస్కౌంట్‌తో రూ.3,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ అమ్మకాలు డిసెంబర్ 10 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ప్రారంభమవుతాయి. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, మింట్ బ్లూ, వైబ్రెంట్ ఆరెంజ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

హెల్త్ ఫీచర్లు, బ్యాటరీ

హెల్త్ మానిటరింగ్‌లో హార్ట్ రేట్ ట్రాకింగ్, SpO2, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, మెన్‌స్ట్రుయేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మ్యూజిక్ కంట్రోల్, కంపాస్, పర్సనల్ కోచ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక బ్యాటరీ విషయానికి వస్తే, Realme Watch 5 16 రోజుల వరకు స్టాండర్డ్ యూజ్, 20 రోజుల వరకు లైట్ మోడ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. IP68 రేటింగ్ కలిగిన ఈ వాచ్ నీటి, దుమ్ము నిరోధకతతో మరింత మెరుగైన వినియోగాన్ని అందిస్తుంది.

Also Read: CM Revanth Reddy: అధికారం చేపట్టిన రోజు నుంచే రేవంత్ మార్క్.. గ్యారంటీ అమలులో చిత్తశుద్ధి చాటుకున్న సీఎం!

 

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్