Oppo Smart Phone: ఒప్పో కొత్త ఫోన్ ఫీచర్లు గురించి తెలుసా?
Oppo ( Image Source: Twitter)
Technology News

Oppo Smart Phone: భారత్ లో లాంచ్ అయిన ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే!

Oppo Smart Phone: Oppo డిసెంబర్ 2న తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Oppo A6x ను అధికారికంగా విడుదల చేసింది. మీడియాటెక్ Dimensity 6300 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్, భారీ 6,500mAh బ్యాటరీతో మార్కెట్లో దుమ్ము రేపుతోంది. A-సిరీస్‌లో తాజా మోడల్‌గా వచ్చిన ఈ డివైస్ మంచి ఫీచర్లతో, తగ్గ ధరలో అందుబాటులోకి వచ్చి కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read: Alibaba Quark AI Glasses: కళ్ల ముందే అన్నీ.. AI కళ్లజోడును రిలీజ్ చేసిన అలీబాబా, దీని ఫీచర్స్‌ తెలిస్తే ఫిదా అయపోతారు

Oppo A6x స్పెసిఫికేషన్స్

Oppo A6x డ్యూయల్-SIM సపోర్ట్‌తో వస్తుంది. ఇందులోని Dimensity 6300 చిప్‌సెట్‌ను Xiaomi Redmi 15C, Moto G Power, Realme C85 వంటి ఫోన్లు కూడా వాడుతున్నాయి. ఫోన్ Android 15 ఆధారిత ColorOS 15 పై నడుస్తుంది. 6GB RAM వరకు, 128GB UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. డివైస్‌లో 6.75 ఇంచుల LCD డిస్‌ప్లే ఉంది. ఇది HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1,125 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. పవర్ బటన్‌లోనే ఉండే సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది. కెమెరాల విషయానికి వస్తే, ఫోన్‌లో 13MP వైడ్-ఆంగిల్ మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 5MP కెమెరా కూడా ఇచ్చారు. ఈ రెండూ 1080p వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తాయి. పెర్ఫార్మెన్స్‌ను బలంగా నిలబెట్టడానికి 6,500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ తో పాటు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.

Also Read: Hyderabad House History: ఢిల్లీలో ‘హైదరాబాద్ హౌస్’ ఎందుకుంది?, ఎవరు నిర్మించారు?, పుతిన్ పర్యటన వేళ ఆశ్చర్యపరిచే హిస్టరీ ఇదే!

Oppo A6x ధరలు – ఆఫర్లు

Oppo A6x మనకీ రెండు కలర్ ఆప్షన్లలో మన ముందుకు వస్తోంది. ఐస్ బ్లూ, ఆలివ్ గ్రీన్.

4GB + 64GB వేరియంట్ ధర రూ. 12,499 గా ఉంది
4GB + 128GB వేరియంట్ ధర రూ. 13,499 గా ఉంది
6GB + 128GB వేరియంట్ ధర రూ. 14,999 గా ఉంది.

Also Read: Sathupalli: అర్బన్ పార్క్‌లో దుప్పుల వేట.. అటవీ శాఖ దర్యాప్తు పెరుగుతున్న అనుమానాలు.. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరో?

కొన్ని బ్యాంకులపై 3 నెలల వరకు ఇంటరెస్ట్-ఫ్రీ EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే అమెజాన్ ( Amazon) , ఫ్లిప్ కార్ట్ (Flipkart) , ఒప్పో ఇండియా ( Oppo India ) వెబ్‌సైట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా సేల్స్‌కు అందుబాటులో ఉంది.

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్