Curd: ప్రతి రోజూ పెరుగు తింటే జరిగేది ఇదే..
Curd ( Image Source: Twitter)
లైఫ్ స్టైల్

Curd: ఒక నెల పాటు రాత్రి పూట పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Curd: భారతీయ వంటింట్లో పెరుగు (Curd) కి ప్రత్యేక స్థానమే ఉంది. “రాత్రి పెరుగు తినడం మంచిదేనా లేక మానేయాలా?” అని చాలా మంది సందేహిస్తుంటారు. మన ఇంటి పెద్దలు రాత్రి పూట పెరుగు తినొద్దని హెచ్చరిస్తుంటారు. జలుబు, కఫం, అజీర్ణం వస్తాయని అంటారు. కానీ, మరోవైపు ఆధునిక పోషకాహార నిపుణులు, శాస్త్రీయ పరిశోధనలు మాత్రం పెరుగు రాత్రి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటం, నిద్ర బాగా రావటం, బరువు నియంత్రణ వంటి ప్రయోజనాలున్నాయని చెబుతున్నాయి. ప్రతి రోజు రాత్రి ఒక బౌల్ పెరుగు తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో చూద్దాం.

పెరుగులో ఉన్న పోషకాలు

పెరుగు ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ హెల్త్‌కి ఎంతో అవసరం. Nutrients అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, పెరుగులో ఉన్న ప్రోటీన్ రాత్రిపూట కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. దీని వల్ల ఫిట్‌నెస్ ప్రియులకు ఇది మంచి ఆప్షన్‌గా మారుతోంది.

Also Read: Sathupalli: అర్బన్ పార్క్‌లో దుప్పుల వేట.. అటవీ శాఖ దర్యాప్తు పెరుగుతున్న అనుమానాలు.. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరో?

రాత్రి పెరుగు తింటే కలిగే ప్రయోజనాలు

1. జీర్ణక్రియకు మంచి తోడు

పోషకాహార నిపుణురాలు శిల్పా అరోరా చెబుతున్నట్టుగా, రాత్రి పెరుగు తింటే అజీర్ణం వస్తుందన్నది పూర్తిగా అపోహ. పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను సజావుగా నడిపిస్తాయి. దీని వల్ల గ్యాస్, ఆమ్లత లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

2. మంచి నిద్రకు సహాయపడుతుంది

పెరుగులో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో సిరోటొనిన్, మెలటోనిన్ హార్మోన్లు తయారుకావడానికి దోహదపడుతుంది. ఇవే మనకు మంచి నిద్ర వచ్చేలా చూసుకుంటాయి. ఇంకా పులియబెట్టిన పాల పదార్థాలు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

Also Read: Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీ‌లో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?

3. ఎక్కువసేపు పొట్ట నిండిన ఫీలింగ్

పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల రాత్రి ఆకలి అదుపులో ఉంటుంది. లేట్ నైట్ స్నాక్స్
తినాలనే తపన తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి పెరుగు బెస్ట్ ఆప్షన్.

Also Read: Kishan Reddy: ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

4. రోగనిరోధక శక్తి పెరుగుతుంది

మన ఇమ్యూన్ సిస్టమ్ మనం నిద్రపోతున్నప్పుడు రిపేర్ అవుతుంది. ఆ సమయంలో పెరుగులోని ప్రోబయోటిక్స్ శరీరానికి మద్దతు ఇస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, రెగ్యులర్‌గా పెరుగు తినడం ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి.

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం