Realme Smart Phone: రియల్‌మీ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది..
Realme Smart Phone ( Image Source: Twitter)
Technology News

Realme Smart Phone: రియల్‌మీ P4x 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. మరి, ఇంత చీపా?

Realme Smart Phone: రియల్‌మీ భారత్‌లో కొత్తగా తన P సిరీస్‌కు సంబంధించిన Realme P4x 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చి, 7,000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, MediaTek Dimensity 7400 Ultra ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 6GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌లు కలిగిన ఈ ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లేతో, 50MP ప్రధాన కెమెరాతో, IP64 రేటింగ్‌తో వస్తోంది.

Also Read: AICC Meenakshi Natarajan: మూడు నెలల్లో డీసీసీలు మీ పనితీరు నిరూపించుకోవాల్సిందే.. లేకుంటే తప్పుకోండి: మీనాక్షి నటరాజన్

ధర ఎంతంటే?

భారత మార్కెట్‌లో Realme P4x 5G ధర రూ.15,499 నుంచి ప్రారంభమవుతోంది. 6GB + 128GB మోడల్ రూ. 15,499 కాగా, 8GB + 128GB మోడల్ రూ.16,999, 8GB + 256GB వేరియంట్ రూ.17,999 కు లభిస్తుంది. మ్యాట్ సిల్వర్, ఎలిగెంట్ పింక్, లేక్ గ్రీన్ ఇలా మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌గా 6GB + 128GB మోడల్‌ను రియల్‌మీ రూ.13,499 ప్రత్యేక ధరకు అందిస్తోంది. డిసెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart మరియు Realme.comలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Also Read: DGP Shivadhar Reddy: సైబర్ నేరాల కట్టడిలో మనమే నెంబర్​ వన్.. ఫ్రాడ్​ కా ఫుల్​ స్టాప్​ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Realme UI 6.0 పై రన్ అయ్యే ఈ ఫోన్ 6.72 ఇంచుల Full HD+ LCD డిస్‌ప్లేతో వస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 391ppi పిక్సెల్ డెన్సిటీతో ఇది గేమింగ్ మీడియా వినియోగానికి అనువైనది. MediaTek Dimensity 7400 Ultra 6nm చిప్‌సెట్‌తో శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. 18GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది.

కెమెరా విషయంలో, రియర్‌లో 50MP ప్రైమరీ సెన్సర్ + 2MP సెకండరీ సెన్సర్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 8MP సెల్ఫీ కెమెరా ఫ్రంట్‌లో అందించారు. ఫోన్‌లో Frozen Crown Cooling System కూడా ఉండటం వల్ల దీర్ఘకాలిక గేమింగ్‌లో వేడి ఎక్కువగా పెరగకుండా ఉంటుంది.

Also Read: Ghantasala The Great: లిస్ట్‌లోకి మరో సినిమా.. డిసెంబర్ 12న మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే?

కనెక్టివిటీ పరంగా Bluetooth, 5G, GPS, GLONASS, Galileo, QZSS, Wi-Fi, USB Type-C వంటి అన్ని ముఖ్యమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ కూడా ఉంది. 7,000mAh భారీ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక బరువు గురించి మాట్లాడితే ఫోన్ బరువు 208 గ్రాములు ఉంది.

Just In

01

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన

Realme Smart Phone: రియల్‌మీ P4x 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. మరి, ఇంత చీపా?

Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..