Ghantasala The Great: తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల బయోపిక్.. ‘ఘంటసాల ది గ్రేట్’ (Ghantasala The Great) విడుదల తేదీ ఫిక్సయింది. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్‌లోని విభిన్న ఘట్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి కేవలం ప్రివ్యూ షోలతోనే ప్రేక్షకుల చేత ఔరా అనిపించారు దర్శకుడు సి.హెచ్. రామారావు (CH Rama Rao). ఇప్పటి వరకు ఈ బయోపిక్ చూసిన వారంతా.. ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇందులో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా, సీనియర్ నటుడు సుమన్ ఓ ముఖ్య పాత్రను పోషించారు. అయితే ఈ సినిమాకు భారీ పోటీ నెలకొని ఉండటం విశేషం. అంత పోటీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారంటే సినిమాపై నిర్మాతలకు ఉన్న నమ్మకం అలాంటిదనేలా టాలీవుడ్‌లో టాక్ నడుస్తుంది.
Also Read- Balakrishna: మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్!
‘ఘంటసాల ది గ్రేట్’పై ప్రశంసలు
‘ఘంటసాల ది గ్రేట్’ విషయానికి వస్తే.. ఘంటసాల వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ప్రివ్యూ షోలు నిర్వహించారు. అక్కడి భారతీయులు ఈ చిత్రాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా టీమ్ వెల్లడించింది. ‘ఘంటసాల గాత్రం, గౌరవం, మహిమను మరోసారి అనుభవించే అవకాశం ఇచ్చింది’ చూసిన వాళ్లంతా అక్కడి మీడియాకు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. లెజెండ్ ఘంటసాల బయోపిక్ ఇంత గ్రాండ్‌గా, ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా చేసిన దర్శకుడు సి.హెచ్. రామారావు ప్రతిభను వారంతా మెచ్చుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం, వరల్డ్ వైడ్ ఆడియన్స్ కోసం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం చేశారు మేకర్స్. త్వరలోనే ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read- Pushpa 2: ‘కొన్నిచివా, నిహోన్ నో తోమో యో’.. జపాన్‌కు ‘పుష్ప రాజ్’ సవాల్.. రిలీజ్ ఎప్పుడంటే?
డిసెంబర్ 12న రిలీజ్‌కు సిద్ధమైన సినిమాలివే..
ఇక ఈ సినిమాకు పోటీగా రేసులో నాలుగు సినిమాలు దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన ఫైట్ జరగబోతుందని ట్రేడ్ వర్గాలు సైతం చెబుతున్నాయి. డిసెంబర్ 5 నందమూరి నటసింహం బాలయ్య ‘అఖండ2: తాండవం’తో థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన కరెక్ట్‌గా వారం రోజులకు ‘ఘంటసాల ది గ్రేట్’ విడుదలకు వస్తుంది. ఈ సినిమాతో పాటు డిసెంబర్ 12న సుమ కనకాల కుమారుడు నటించిన ‘మోగ్లీ 2025’, తమిళ స్టార్ హీరో కార్తి నటించిన ‘అన్నగారు వస్తారు’, నందు హీరోగా నటించిన ‘సైక్ సిద్ధార్థ్’, రామ్ కిరణ్ నటించిన ‘స:కుటుంబానాం’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ప్రేక్షకులను ఏ సినిమా మెప్పిస్తుందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
