QR Code Graves: మనకి తెలిసినంత వరకు మన దేశంలో మార్కెట్లోనే QR కోడ్ల ను చూశాము. కానీ, ఒక దేశంలో సమాధులపైన కూడా QR కోడ్లు ఉన్నాయి. అయితే, అలా ఎందుకు పెట్టారో చాలా మందికి అర్థం కాలేదు. ఎవరైనా QR కోడ్ చూస్తే డబ్బులు వేయడానికి స్కాన్ చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం అలా కాదు. వింతగా ఉంది కొత్తగా ఆలోచించి చనిపోయిన మనిషికి ఒక గుర్తింపు లాగా ఇచ్చారు. మరి, ఆ దేశం ఎక్కడ ఇక్కడ తెలుసుకుందాం..
అక్కడి సమాధులపై QR కోడ్లు..
ఆ దేశం ఏదో కాదు జపాన్. ఇక్కడ కొంతమంది సమాధులపై QR కోడ్లు పెట్టడం ఒక ప్రత్యేకత. ఆ QR కోడ్‌ను స్కాన్ చేస్తే, మరణించిన మనిషి జీవితం గురించి వివిధ రకాల డిజిటల్ సమాచారం కనిపిస్తుంది. అందులో వారి ఫోటోలు, వీడియోలు, జీవిత చరిత్ర, వంశపారంపర్యం, వృత్తి, ముఖ్యమైన ఘట్టాల వివరాలు ఉంటాయి.
ఇంకా వారి బంధువులు , సందర్శకులు, సంతాప సందేశాలు, నివాళి ఎంట్రీలు, అతిథి పుస్తక ఎంట్రీలు కూడా ఆ వెబ్ పేజీలో చూడగలుగుతారు. ఇలా QR కోడ్ వలన భౌతిక సమాధి దగ్గరకి వెళ్లకపోయినా, ఆ వ్యక్తి గురించి ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. కానీ, ఇది ప్రతి సమాధి మీద ఉండదు. జపాన్‌లో మాత్రమే కొన్ని సమాధులకు ఈ విధానం ఉంది. అలాగే, కొన్నివైరల్ ఫోటోలు నిజానికి జపాన్ సమాధులు కాకుండా ఇతర స్మారక స్థలాలు కూడా కావచ్చు. కాబట్టి, QR కోడ్ స్కాన్ చేస్తే చనిపోయిన వ్యక్తి జీవితం, ఫోటోలు, వీడియోలు, నివాళి సందేశాలు వంటి డిజిటల్ కంటెంట్ మాత్రమే చూడగలుగుతారు.
అయితే, దీని మీద నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. మనం ఓటు వేసే ముందు కూడా ఆ అభ్యర్థి ఎలాంటి వాడు అనే స్కానర్ కూడా పెడితే అభివృద్ధి బాగుటుందని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఇలా పెట్టాలి. ఇది మంచి ఆలోచన దీని వలన మన పిల్లలు కూడా తాత, ముత్తాతలను కూడా చూస్తారు. ఆ జనెరేషన్ గురించి ఒక అవగాహన వస్తుందని అంటున్నారు.
