CS Ramakrishna Rao: గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న
CS Ramakrishna Rao ( image Credit: swetcha reporter)
Telangana News

CS Ramakrishna Rao: గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీఎస్.. భారీగా ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం

CS Ramakrishna Rao: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సీఎస్ రామకృష్ణ రావు(CS Ramakrishna Rao) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సబ్యసాచి ఘోష్, సంజయ్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖులకు, దేశ, విదేశీ అతిథులకు ఆహ్వానాలు పంపిస్తామని, వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Also Read: Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాద మృతుల బాధితులకు నష్ట పరిహారం ప్రకటించిన సీఎం

ప్రజా భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు

ఈ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా ప్రజా భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిర్వహిచే అతిపెద్ద సమ్మిట్‌లో అన్ని శాఖలు తమ పురోగతిని షో కేస్ చేయాలని సూచించారు. మరోవైపు, ఈ సమ్మిట్‌లో ప్రధానంగా ప్లీనరీ, ముఖ్యమంత్రి వన్ టు వన్ సమావేశాలు, వివిధ సంస్థలచే ఎంఓయూలు అనే ప్రధాన అంశాలుంటాయని సీఎస్ తెలిపారు. ఈ సమ్మిట్‌లో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌తో సమ్మిట్ ముగుస్తుందని సీఎస్ వెల్లడించారు.

Also Read: CS Ramakrishna Rao: దిగజారుడు చర్యలు తగ్గించుకోండి.. ఉద్యోగులకు సీఎస్ హెచ్చరిక!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?