CS Ramakrishna Rao (imagecredit:twitter)
తెలంగాణ

CS Ramakrishna Rao: దిగజారుడు చర్యలు తగ్గించుకోండి.. ఉద్యోగులకు సీఎస్ హెచ్చరిక!

CS Ramakrishna Rao: హద్దులు మీరితే చర్యలు తప్పవని సీఎస్ రామకృష్ణరావు హెచ్చరించారు. ఐఏఎస్‌లు, అధికారులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. దిగజారుడు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఏ స్థాయి అధికారిపై అయినా చర్యలు ఉంటాయని నొక్కి చెప్పారు. బహిరంగ సభలు, సమావేశాల్లో హోదాను మరిచి వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇదే హెచ్చరిక అంటూ ఆయన ఘటుగా పేర్కొన్నారు.

అధికారులు తమ హోదాను, వ్యక్తిత్వాన్ని తగ్గించుకునేలా వ్యవహరించడం సరికాదన్నారు. దీని వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ 1964లోని రూల్‌ 3 ప్రతి ఉద్యోగి విధికి అంకితమై, సంపూర్ణ క్రమశిక్షణ, నిష్పక్షపాతంగా పని చేయాలని సూచిస్తుందన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరచిపోవద్దని నొక్కి చెప్పారు. ఇకపై ఐఏఎస్‌ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, సభలు, సమావేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, హోదాను మరిచి ప్రవర్తించినా, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు.

Also Read: MLA Bhuma Akhilapriya: అధిష్టానంపై భూమా అఖిల ప్రియ ఫైర్.. పెద్ద మాటే అనేశారుగా!

సీఎం కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశం

రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌ రెడ్డి నాగర్ కర్నూల్‌ జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఐఏఎస్‌ అధికారి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ శరత్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని పొగడడంతో పాటు ఆయన కాళ్లు మొక్కారు. ఒక ఐఏఎస్‌ అధికారిగా ఉంటూ రేవంత్‌ రెడ్డి కాళ్లకు నమస్కరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ పుల్ వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారమంతా పొలిటికల్ విమర్శలకు దారి తీసింది. పైగా గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారులు స్థాయిని మరిచి రాజకీయాల్లో భాగమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతోనే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎస్‌ రామకృష్ణారావు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఐఏఎస్‌, ప్రభుత్వ ఉద్యోగులను దారిలో పెట్టడమే లక్ష్యంగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగ సభలు, సమావేశాల్లో స్థాయికి తగని పనులు చేస్తున్నారని, ఇవి ప్రజల్లో అధికారులపై చులకనభావాన్ని ఏర్పరుస్తున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు చర్యలు వ్యక్తిత్వాన్ని తగ్గించడంతో పాటు హోదాను కించపరుస్తాయన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణిస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో సివిల్ సర్వీసెస్ అధికారుల ప్రవర్తనపై కూడా సర్కార్ ఫోకస్ పెడుతుందన్నారు. రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరూ ముందుకు సాగినా చర్యలకు వెనకాడబోమని పేర్కొన్నారు.

Also Read: AP Govt: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

 

Just In

01

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!