MLA Bhuma Akhilapriya (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

MLA Bhuma Akhilapriya: అధిష్టానంపై భూమా అఖిల ప్రియ ఫైర్.. పెద్ద మాటే అనేశారుగా!

MLA Bhuma Akhilapriya: మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అఖిల ప్రియ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మినీ మహానాడు (Mini Mahanadu) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన ఆమె.. పార్టీ అదిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తమకు తెలియకుండా ఎవరికైనా పదవులు ఇస్తే ఊరిలో అడుగుపెట్టనివ్వమని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అదిష్టానం దృష్టికి తీసుకెళ్తా
పదవులు ఇవ్వాలనుకుంటే తొలి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని టీడీపీ అదిష్టానానికి అఖిల ప్రియ సూచించారు. అసలు పని చేయని వారికి పదవులు కట్టపెడితే అది సమంజసం కాదని అన్నారు. టీడీపీ పార్టీ కోసం, భూమా కుటుంబం కోసం పని చేసిన వారికి తప్పకుండా పదవులు ఇప్పిస్తామని మినీ మహానాడు వేదికపై అఖిల ప్రియ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అదిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆమె స్పష్టం చేశారు.

కార్యకర్తకు న్యాయం జరగాలి
గత వైసీపీ ప్రభుత్వం (Ex YCP Govt)లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు టీడీపీ (Telugu Desam Party) అధికారంలోకి వచ్చిందని అఖిల ప్రియ గుర్తు చేశారు. ఇందుకు కార్యకర్తలు చాలా సంతోషిస్తున్నారని చెప్పారు. కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కచ్చితంగా టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రజలకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పారు.

ఈ గెలుపు ప్రజలది
వైసీపీ నాయకులు చాలాసార్లు తమకు రాయబారం పంపారని భూమా అఖిల ప్రియ ఆరోపించారు. 60% – 40% తీసుకుందామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. ఏ రోజు వారు చెప్పిన మాటలకు సమాధానం ఇవ్వలేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే (Allagadda Assembly constituency) తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో గెలుపు నాది కాదని.. స్థానిక ప్రజలదని స్పష్టం చేశారు.

Also Read: Karimnagar Railway Station: స్వర్గం లాంటి రైల్వే స్టేషన్.. సౌఖర్యాలు చూస్తే మతి పోవాల్సిందే!

గతంలోనే ఇంతే!
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనే ఈ తరహా వ్యాఖ్యలతో ఆమె వార్తల్లో నిలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమె విపక్ష నేతలతో పాటు కొందరు అధికార పార్టీ నేతలను టార్గెట్ చేయడం పలు సందర్భాల్లో సంచలనంగా మారాయి. అయితే ఇప్పుడు మినీ మహానాడు వేదికగా నేరుగా అదిష్టానాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read This: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. మంత్రి కీలక ఆదేశాలు.. రంగంలోకి కమిటీ!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!