Lady Serial Killer: అందంగా ఉన్నారని.. నలుగురిని చంపిన యువతి
Woman serial killer (Image Source: Twitter)
క్రైమ్

Lady Serial Killer: తన కంటే అందంగా ఉన్నారని.. నలుగురిని చంపిన మహిళ.. కన్నబిడ్డనూ వదల్లేదు!

Lady Serial Killer: హర్యానా (Haryana)లోని పానిపట్ (Panipat)లో ఓ మహిళా సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 30 ఏళ్ల వయసున్న ఆమె.. 2023 నుంచి ఇప్పటివరకూ నలుగురు చిన్నారులను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో ఆమె కన్నబిడ్డ సైతం ఉన్నట్లు తేల్చారు. వారు తనకంటే అందమైన రూపాన్ని కలిగి ఉన్నారన్న కారణంతోనే ఆమె ఈ హత్యలకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు ఆ నలుగురివి సహజ మరణాలుగా కనిపించేలా లేడీ కిల్లర్ జాగ్రత్తలు సైతం తీసుకుందని పానిపట్ పోలీసులు పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే..

పానిపట్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. హర్యానా సోనిపట్ జిల్లాలోని శివహ్ గ్రామానికి చెందిన పూనమ్ (Poonam).. భవడ్ గ్రామానికి చెందిన నవీన్ ను వివాహం చేసుకుంది. ఆమె రెండేళ్ల వ్యవధిలో నలుగురు చిన్నారులను హత్య చేసినట్లు అంగీకరించింది. చాలా అందంగా కనిపించే పిల్లలను టార్గెట్ చేసినట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. ఏ పిల్లలు తనకంటే ఆకర్షణీయంగా ఉండకూడదనే అసూయతోనే ఆమె ఈ హత్యలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. అయితే పూనమ్.. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

2023లో రెండు హత్యలు..

పూనమ్ తన మెుదటి హత్యను 2023లో సోనిపట్ లోని భవడ్ గ్రామంలో చేసింది. మెుదటగా తన బావ (భర్తకు అన్న) కూతుర్ని, ఆ తర్వాత కన్న కొడుకును ఆమె హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బావ కూతుర్ని చంపుతున్నప్పుడు కన్నకొడుకు చూశాడని.. దాంతో అతడ్ని కూడా పూనమ్ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత అనుమానం రాకుండా వారి మృతదేహాలను నీటి ట్యాంకులో పడేసింది. ఏమైందని స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రశ్నించగా ఆడుకుంటూ ట్యాంకులో పడిపోయారని చెప్పి పూనమ్ వారిని నమ్మించింది.

ఈ ఆగస్టులో మూడో హత్య..

ఈ ఏడాది ఆగస్టులో శివహ్ గ్రామంలోనూ ఓ చిన్నారిని అదే విధంగా పూనమ్ హత్య చేసింది. మూడు హత్యలు చేసినప్పటికీ ఆమెపై ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ఈ నెల 1వ తేదీన నౌల్తా గ్రామంలోని ఒక వివాహ వేడుకలోనూ ఆరేళ్ల బాలిక (పూనమ్ మేనకోడలు) నీటి తొట్టేలో మృతదేహమై కనిపించింది. బాలిక మృతి చెందిన గదికి బయటి నుంచి తాళం పెట్టడంతో అనుమానాలు మెుదలయ్యాయి. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది.

Also Read: Shashirekha Song: మెగాస్టార్ ‘మనశంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?

కిల్లర్ ఎలా చిక్కిందంటే?

పానీపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపేందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన బాలిక తాత పాల్ సింగ్ రిటైర్ట్ పోలీసు ఆఫీసర్ కావడంతో హత్యపై అనుమానాలు బలపడ్డాయి. ఆ బాలికను ఉద్దేశపూర్వకంగా తొట్టెలో ముంచి చంపారని పోస్టుమార్టం రిపోర్టులోనూ వెల్లడైందని ఎస్పీ భూపేందర్ తెలిపారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. అన్ని ఆధారాలు పూనమ్ దగ్గరకు తీసుకెళ్లాయని చెప్పారు. ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా బాలికను తానే హత్య చేసినట్లు పూనమ్ ఒప్పుకుందని ఎస్పీ తెలిపారు. అంతేకాదు గతంలో మరో ముగ్గురు చిన్నారులను సైతం చంపినట్లు ఆమె అంగీకరించిందని వివరించారు.

Also Read: IndiGo Flights: హైదరాబాద్ విమానాశ్రయంలో భారీ అంతరాయం.. 40 ఇండిగో విమానాలు రద్దు

Just In

01

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్