Shashirekha Song: ‘మనశంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో అప్డేట్
sasi-rekha(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Shashirekha Song: మెగాస్టార్ ‘మనశంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?

Shashirekha Song: మెగాస్టార్ ‘మనశంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మనశంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి మరో అప్టేట్ వచ్చింది. ఇప్పటికే “మానశంకరవరప్రసాద్ గారు” చిత్రం నుంచి వచ్చిన తొలి పాట “మీసాలపిల్ల” ప్రేక్షకుల్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. విడుదలైన కొద్ది రోజుల్లోనే సంగీత ప్రియుల నాలుకలపై నృత్యం చేస్తూ, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటకు లభించిన అపారమైన ప్రేమ, ఆదరణ ఇప్పటికీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ అనూహ్యమైన విజయంతో చిత్ర బృందం ఉత్సాహంలో మునిగి తేలుతోంది. ఈ నేపథ్యంలో, ఆ అంచనాలను మరింత పెంచుతూ, తాజాగా మేకర్స్ తమ చిత్రం నుంచి రెండవ సింగిల్ గురించి అధికారిక ప్రకటన చేశారు.

Read also-Lockdown Movie: మరోసారి వాయిదాపడ్డ అనుపమ పరమేశ్వరన్ ‘లాక్‌డౌన్’ సినిమా.. కారణం ఇదే..

‘శశిరేఖ’ లిరికల్ వీడియో..

ఇక ఇప్పుడు, ‘మానశంకరవరప్రసాద్ ‌గారు’ చిత్రం నుంచి మరొక అద్భుతమైన చార్ట్‌బస్టర్ పాటకు మార్గం సుగమం అవుతోంది. రెండో సింగిల్‌గా “శశిరేఖ” పాట విడుదల కానుంది. చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పాట లిరికల్ వీడియో డిసెంబర్ 8వ తేదీన విడుదల కానుంది. అంతకంటే ముందుగా, పాట సారాంశాన్ని, మాధుర్యాన్ని తెలియజేసే సాంగ్ ప్రోమోను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ ప్రకటన సంగీత ప్రియుల హృదయాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. “మీసాలపిల్ల” పాట మాదిరిగానే, ఈ రెండో పాట “శశిరేఖ” కూడా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన స్వరాలకే దక్కింది. తనదైన ప్రత్యేకమైన సంగీత శైలి, మాస్‌ బీట్స్‌తో శ్రోతలను మంత్రముగ్ధులను చేసే భీమ్స్, ఈసారి “శశిరేఖ”తో ఎలాంటి మ్యూజికల్ ట్రీట్‌ ఇవ్వబోతున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భీమ్స్ – చిరు అనిల్ కాంబినేషన్ మరోసారి చార్ట్‌బస్టర్ హిట్‌ను అందిస్తుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Read also-Rashmika Vijay: ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన రష్మికా మందన్నా.. ఏం అన్నారంటే?

చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ ప్రకటన సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ పాట విడుదల తేదీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా, తొలి పాట సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, “శశిరేఖ” పాట కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. MSG సంక్రాంతి 2026 విడుదల లక్ష్యంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. సంక్రాంతి రేసులో నిలవనున్న ఈ సినిమా, పండుగ వాతావరణంలో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. ఏదేమైనా, డిసెంబర్ 6న విడుదల కానున్న ప్రోమో, ఆపై డిసెంబర్ 8న రానున్న పూర్తి లిరికల్ వీడియో కోసం సంగీత అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో వెంకీ మామ కీ రోల్ చేయడం, ఇద్దరు లెజండరీ హీరోలు కలిసి స్టెప్పులేయండం చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!